మిర్చి కాంబినేషన్ రిపీట్ అవుతుందా?

మిర్చి సినిమాతో సర్రున ఇండస్ట్రీలోకి దూసుకువచ్చేసారు కొరటాల శివ. అప్పటి వరకు రైటర్ గా వున్న ఆయన డైరక్టర్ గా తానేంటో చేసి చూపించేసారు. అప్పటి నుంచి తిరుగులేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం…

మిర్చి సినిమాతో సర్రున ఇండస్ట్రీలోకి దూసుకువచ్చేసారు కొరటాల శివ. అప్పటి వరకు రైటర్ గా వున్న ఆయన డైరక్టర్ గా తానేంటో చేసి చూపించేసారు. అప్పటి నుంచి తిరుగులేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరిలో ఒకటే క్వశ్చను. తొలి సినిమా ప్రభాస్ తో చేసి, మళ్లీ చేయలేదేమిటి?

మహేష్ తో రెండు సినిమాలు చేసారు. ఎన్టీఆర్ తో మళ్లీ చేయబోతున్నారు. చరణ్ తో సినిమా అంటున్నారు? ప్రభాస్ సంగతేమిటి? అనే ఫ్యాన్స్ అనుమానం. వినిపిస్తున్న వార్తలు నిజమైతే ఆ కోరిక తీరబోతోంది. ప్రభాస్ ను కొరటాలను కలిపి మళ్లీ ఓ మాంచి సినిమా తీసే ప్రయత్నం చేస్తోంది మైత్రీ మూవీస్ సంస్థ. 

ప్రభాస్ దగ్గర రెండు విడతలుగా ఇచ్చిన గట్టి అడ్వాన్స్ వుంది. కొరటాల శివకు యువి సంస్థకు మధ్య ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వుందని టాక్ వుంది. అందువల్ల మైత్రీతో అయితే ఎవ్వరికీ ఏ అభ్యంతరం వుండకపోవచ్చు. అయితే ప్రస్తుతం చేస్తున్న రాథేశ్వామ్ సినిమా వుంది. అలాగే నాగ్ అశ్విన్ సినిమా ఓకె చేసారు. అది దాదాపు రెండేళ్లు పడుతుంది. పైగా నాగ్ అశ్విన్ సినిమా ఈ ఆగస్టులో లాంఛనంగా ఓ షెడ్యూలు జరిపే ఆలోచనలు సాగుతున్నాయి.

వాస్తవానికి అశ్వనీదత్ కన్నా ముందే మైత్రీకి చేయాలి. ఎందుకంటే వీళ్లదే ముందు అడ్వాన్స్. నాగ్ అశ్విన్ కనుక ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటాను అంటే, ఈ లోగా కొరటాలతో సినిమా లాగించేసే ఆలోచనలో మైత్రీ మూవీస్ వుంది. మరోపక్క అదే కొరటాలతో రామ్ చరణ్ సినిమా వేరే నిర్మాతతో డిస్కషన్లలో వుంది.

టాప్ ఫైవ్ డైరక్టర్లలో ఒక్క కొరటాల మాత్రమే తరువాత సినిమాకు రెడీగా వున్నారు. అందుకే చాలా కాంబినేషన్లు వినిపిస్తున్నాయి. మహేష్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా. ఎవరిది ఫైనల్ అవుతుందో చూడాలి.

సూపర్ స్టార్ అనేది బిరుదు మాత్రమే కాదు  భాధ్య‌త!