దేశంలో కరోనా టెస్టుల సంఖ్య రోజురోజుకూ పెంచుతూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో బాగా శ్రద్ధ చూపి పరీక్షలు చేస్తున్నాయి. ఆ విషయంలో ఏపీ ముందుంది. దేశంలోనే అత్యంత ఎక్కువగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో నిలుస్తూ ఉంది. ఇక మరి కొన్ని రాష్ట్రాలు మాత్రం చేతులెత్తేసినట్టుగా వ్యవహరిస్తున్నాయి. అవసరం అనుకున్న వాళ్లు ప్రైవేట్ కు వెళ్లి టెస్టులు చేయించుకోవచ్చు, ఆ వైరస్ సోకినా దాచాలనుకునే వాళ్లు దాచుకోవచ్చు.. అన్నట్టుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి.
ఇక రోజువారీగా దేశంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే గత రెండు రోజులుగా ఈ గ్రాఫ్ చిన్న డిప్ చోటు చేసుకుంటోంది. గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య రికవరీల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. గత రెండు రోజులుగా పెద్దగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడం లేదు. అయితే కొత్తగా రిజిస్టర్ అవుతున్న సంఖ్య – రికవరీల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు స్టడీగా కొనసాగుతూ ఉంది.
అయితే మరో పరిశీలన ఏం చెబుతోందంటే.. ఇండియాలో టెస్టుల సంఖ్య పెంచుతున్నప్పటికీ పాజిటివ్ రేటు మాత్రం ఎనిమిది శాతంగా మాత్రమే ఉందనే విషయాన్ని పేర్కొంటోంది. సాధారణంగా టెస్టుల సంఖ్య పెంచిన కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరగాలని.. అయితే ఇండియాలో మాత్రం మొదటి నుంచి చేస్తున్న పరీక్షల్లో ఎనిమిది శాతం వరకూ పాజిటివ్ కేసుల వస్తున్నాయని, ఇదే పరిస్థితే కొనసాగుతూ ఉందని ఒక పరిశీలన చెబుతోంది.
వంద మందికి పరీక్షలు చేసినప్పుడూ 8 శాతం స్థాయిలోనే పాజిటివ్ కేసులు నమోదు కావడం, వెయ్యి మందికి, లక్ష మందికి పరీక్షలు చేసినా అదే శాతం స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఊరటను ఇచ్చే అంశమని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో రోజువారీ పరీక్షల సంఖ్య ఎనిమిది లక్షలకు పై స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో వీటిల్లో ఎనిమిది శాతం స్థాయిలో పాజిటివ్ అని గుర్తిస్తున్నారట. పరీక్షల సంఖ్యను బాగా పెంచుతున్నా, పాజిటివ్ కేసుల శాతం మాత్రం ఎనిమిదిని మించకపోవడం.. కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరగడం లేదు అనేందుకు ఒక రుజువు అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.