జ‌గ‌న్‌కు కిక్కు ఇచ్చే ప్ర‌శంస‌

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కిక్కు ఇచ్చే ప్ర‌శంస‌. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మంచి చేసినా కొన్ని పార్టీల‌కు, ముఖ్యంగా ఎల్లో మీడియాకు చెడుగానే క‌నిపిస్తుంది. దీన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న ప‌ని…

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కిక్కు ఇచ్చే ప్ర‌శంస‌. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మంచి చేసినా కొన్ని పార్టీల‌కు, ముఖ్యంగా ఎల్లో మీడియాకు చెడుగానే క‌నిపిస్తుంది. దీన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప‌ట్ట‌ణ గృహ నిర్మాణ మంత్రిత్వ‌శాఖ నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి అద్భుత‌మైన ప్ర‌శంస ద‌క్కింది. 

ఇది మ‌రిన్ని మంచి ప‌నులు చేయాల‌నే ప్రోత్సాహం, స్ఫూర్తి క‌లిగిస్తున్నాయి. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. 

ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా దుర్గా శంక‌ర్ మిశ్రా మాట్లాడుతూ ఏపీలో పేద‌ల కోసం ఏకంగా 17,005 కాల‌నీల్లో 28 ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్ల నిర్మాణాల‌ను చేప‌ట్ట‌డం ప్ర‌పంచంలోనే అరుదైన అంశంగా పొగడ్త‌ల‌తో ముంచెత్తారు. అంతేకాకుండా, పేదల ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లాకు ఒక జాయింట్‌ కలెక్టర్‌ను ప్రత్యేకంగా నియమించార‌న్నారు. దీన్నిబ‌ట్టి ప్రభుత్వం పేదలకు ఎంత ప్రాధాన్యం ఇస్తోందో స్పష్టమ‌వుతోంద‌ని చెప్పుకొచ్చారు.

స్వయంగా రాష్ట్రానికి వచ్చి పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల కాలనీలను చూస్తానని ఏపీ అధికారుల‌తో ఆయ‌న అన్నారు. కొన్ని నెల‌ల క్రితం ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 30.76 ల‌క్ష‌ల మంది అక్క‌చెల్లెళ్ల పేరిట ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేసింది. మొద‌టి విడత‌లో 15.60 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణ ప‌నుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేస్తోంది. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా 1.72 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి.  

సెప్టెంబర్‌ నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా గృహ నిర్మాణ శాఖ చర్యలను చేపట్టింది. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా జిల్లాకో జాయింట్‌ కలెక్టర్‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. దీంతో ఇళ్ల నిర్మాణం మ‌రింత వేగ‌వంతం కానుంది. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం కూడా ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టును చేప‌ట్టిన దాఖ‌లాలు లేవు. జ‌గ‌న్ తాను ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన అతిపెద్ద హామీని …అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే అమ‌లు చేయ‌డం విశేషం.

తొలి దశలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్‌ నాటికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు ముందుకేస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను రూ.28,084 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్త‌యితే …జ‌గ‌న్ చెప్పిన‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం ఊర్ల‌ను నిర్మించిన‌ట్టే లెక్క‌. అప్పుడు మ‌రిన్ని కాల‌నీలు అవ‌త‌రిస్తాయి.