నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, ఎల్లో మీడియా రంకుతనం బట్టబయలైంది. వారి బాగోతాలను సీఐడీ దిగంబరంగా నిలబెట్టింది. గతంలో ఓటును నోటు కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బాబు బ్రీప్ చేస్తూ పట్టుబడితే, ఈ దఫా రఘురామకృష్ణరాజుకు వాట్సాప్‌లో బ్రీప్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ సారి తనతో పాటు ఎల్లో టీంను కూడా పట్టివ్వడం ఇందులో ప్రత్యేకత.
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తమ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను సీఐడీ ఛేదించింది. ఇందులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎలా పావులా ఉపయోగపడ్డారో సీఐడీ నిగ్గు తేల్చింది. ఇది మరో ఓటుకు నోటు తరహా కేసుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నుతున్నారని రఘురామకృష్ణరాజు, ఏబీఎన్, టీవీ5 చానళ్లపై సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామ అరెస్ట్ కూడా అయ్యారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
అయితే తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని , విచారణకు ఆదేశించొద్దని ఆ రెండు చానళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయిం చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కుట్రకు సంబంధించి ఆధారాలను సవివరంగా 230 పేజీల్లో సమర్పించింది. ఇందులో ఆశ్చర్యకర, దిగ్భ్రాంతికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సూచనల మేరకు రఘురామ ఏ విధంగా పిటిషన్ దాఖలు చేశారో సీఐడీ నిగ్గు తేల్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌లతో రఘురామ జరిపిన వాట్సాప్ సంభాషణ, చాటింగ్‌లను సీఐడీ తన విచారణలో బయట పెట్టింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను ఆధారాలతో సహా సుప్రీంకోర్టుకు సీఐడీ సమర్పించడం సంచలనం రేకెత్తిస్తోంది.
బెయిల్ రద్దు పిటిషన్ అంశంపై 2021 మార్చి 28, 29, ఏప్రిల్ 2, 3, 4వ తేదీలలో చంద్రబాబుతో రఘురామకృష్ణరాజు వాట్సాప్ చాటింగ్ చేశారు. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కాపీని చంద్రబాబుకు రెండుసార్లు వాట్సాప్ చేసినట్టు సీఐడీ విచారణలో తే ల్చింది. ఆ పిటిషన్ కాపీని చంద్రబాబు చూసి ఆమోదించాకే 2021 ఏప్రిల్ 6న న్యాయస్థానంలో దాఖలు చేశారని తన అఫిడవి ట్‌లో వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీ వాళ్లిద్ధరి మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను తెలుసుకుందాం.
“రఘురామకృష్ణరాజు: సార్… జగన్ బెయిల్ రద్దు పిటిషన్ లేటెస్ట్ వెర్షన్ ఇది. అన్ని పాయింట్లూ కవర్ చేశా.
చంద్రబాబు: నాకు లేటెస్ట్ వెర్షన్‌ను మళ్లీ పంపించగలవా?
రఘురామకృష్ణరాజు: సారీ సార్… ఇప్పుడే పంపిస్తా” అని చెప్పినట్టు రఘురామకృష్ణరాజు పంపారు. అలాగే లోకేశ్‌తో కూడా రఘురామ నిత్యం టచ్‌లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సీఐడీ సేకరించి సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండడం, అలాగే అక్కడ ఏ బెంచ్‌కు కేసు వస్తుంది, న్యాయమూర్తులెవరు? ఎలా స్పందిస్తారనే అంశాలపై కూడా రఘురామ, లోకేశ్ మధ్య వాట్సాప్ సంభాషణ, చాటింగ్ సాగిన విధానాన్ని డైలాగ్‌లతో సహా సుప్రీంకోర్టుకు సీఐడీ సమర్పించడం రాజకీయంగా దుమారం చెలరేగుతోంది.
పక్కా చంద్రబాబు డైరెక్షన్‌లో సీఎం జగన్ బెయిల్ రద్దుతో పాటు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు రఘురామ కృష్ణరాజు పాల్పడ్డారనేందుకు సీఐడీ తగిన ఆధారాలు సేకరించి అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడు, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకుని జగన్ ప్రభుత్వంపై కుట్రలకు పాల్పడ్డం విస్మయం కలిగిస్తోంది.
అధికారం కోసం చంద్రబాబు, ఆయన తనయుడు తమ అనుకూల మీడియాను అడ్డు పెట్టుకుని ఇంత నీచస్థాయికి దిగజారా రంటే నమ్మలేకున్నామని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాయల పకీర్ ప్రాణం ఏడు సముద్రాల అవతల మర్రిచెట్లు తొరలో ఉన్న చిలుకలో ఉన్నట్టు…. చంద్రబాబు, లోకేశ్, ఎల్లో మీడియా, రఘురామకృష్ణరాజు ప్రాణాలు వాట్సాప్‌లో దాగి ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఐడీ అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైనప్పటికీ, ప్రజాకోర్టులో మాత్రం ఈ ఎల్లో గ్యాంగ్ పూర్తిగా అప్రతిష్టపా లైందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ ప్రభుత్వంపై వాళ్ల విద్వేషాలను ఆధారాలతో సహా దిగంబరంగా నిలబెట్టిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దొంగతనం, రంకుతనం ఏదో ఒకరోజు బయట పడతాయని పెద్దలు చెబుతారు. దీనికి తాజాగా రఘురామతో చంద్రబాబు, ఎల్లో మీడియాకున్న బంధం బయటపడ డమే నిదర్శనంగా చెబుతున్నారు.