ఫ్యామిలీని బ‌జారుకీడ్చిన ర‌ఘురామ‌

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు చేష్టల‌తో సొంత వాళ్ల‌కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. చివ‌రికి చేజేతులా త‌న ఫ్యామిలీని కూడా బ‌జారుకీడ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ర‌ఘురామ‌కృష్ణంరాజు విప‌రీత పోక‌డ‌ల వ‌ల్లే ఈ రోజు ఆయ‌న భార్య‌,…

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు చేష్టల‌తో సొంత వాళ్ల‌కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. చివ‌రికి చేజేతులా త‌న ఫ్యామిలీని కూడా బ‌జారుకీడ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ర‌ఘురామ‌కృష్ణంరాజు విప‌రీత పోక‌డ‌ల వ‌ల్లే ఈ రోజు ఆయ‌న భార్య‌, కుమారుడు మీడియా ముందుకొచ్చి గ‌గ్గోలు పెట్టాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

ఇంత కాలం ర‌ఘురామ‌కృష్ణంరాజు కుటుంబం గురించి ఎవరికీ పెద్ద‌గా తెలియ‌దు. ర‌ఘురామ కుమార్తెకు వైఎస్ ఆత్మ కేవీపీ కుమారుడితో వివాహం జరిగింద‌ని మాత్ర‌మే తెలుసు. దివంగ‌త వైఎస్సార్ చొర‌వ వ‌ల్లే కులాలు వేరైనా కేవీపీ, ర‌ఘురామ‌కృష్ణం రాజు వియ్యంకుల‌య్యార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. 

అంత‌కు మించి ర‌ఘురామ‌కృష్ణంరాజు కుటుంబ గురించి ఎప్పుడూ ఎక్క‌డా చ‌ర్చ‌కు రాలేదు. ర‌ఘురామ కుటుంబం బుద్ధిగా గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌మ జీవితాన్ని లీడ్ చేస్తోంది. రాజ‌కీయంగా ర‌ఘురామ‌కృష్ణంరాజు ఎన్ని స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నా …ఆయ‌న కుటుంబ స‌భ్యులెవ‌రూ పొలిటిక‌ల్ తెర‌పై క‌నిపించిన దాఖ‌లాలు లేవు.

అలాంటి కుటుంబాన్ని రోడ్డుపైకి వ‌చ్చి నిస్స‌హాయులై నిలిచేలా ర‌ఘురామ‌కృష్ణంరాజు అత్యుత్సాహం చేసింద‌ని సోష‌ల్ మీడి యాలో పోస్టులు వెలుస్తున్నాయి. ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌క్తిత్వం ఎలాంటిదైనా , పాపం ఆయ‌న భార్య ర‌మ‌, కుమారుడు భ‌ర‌త్ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తోంద‌నే సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయాల్లో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌నేవి ప‌రిధి దాటితో ఏమ‌వుతుందో ర‌ఘురామ‌కృష్ణంరాజు అనుభ‌వ‌మే ఓ హెచ్చ‌రిక అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌ప్పొప్పుల గురించి ప‌క్క‌న పెడితే, ఆయ‌న కోసం త‌ల్లీకొడుకు ప‌డుతున్న వేద‌న మాత్రం ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప చేస్తోంది. ర‌ఘురామ‌ను ఇంట్లోనే  క‌ట్టడి చేసి వుంటే బాగుండేద‌నే భావ‌న తల్లికొడుకులో త‌ప్ప‌క క‌లిగి ఉంటుద‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ కె.రఘురామకృష్ణరాజు భార్య రమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన భద్రత పట్ల తనకు భయంగా ఉందని ఆమె చెప్పారు. రఘురామకృష్ణరాజుకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని ఆమె అన డం గ‌మ‌నార్హం. అలాగే ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌న‌యుడు క‌నుమూరు భ‌ర‌త్ కూడా ఆదే విధ‌మైన ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

త‌న తండ్రిని చ‌ట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకుని హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లాకు ఫిర్యాదు చేశారు.

రాజ‌కీయాల‌తో, ర‌ఘురామ‌కృష్ణంరాజు తిట్ల దండ‌కాల‌తో ఏ మాత్రం సంబంధం లేని త‌ల్లికొడుకు … ప్ర‌స్తుతం మ‌నో వేద‌న అనుభ వించాల్సి రావ‌డం విచార‌క‌రం. త‌న వ‌ల్ల ఇంత మంది బాధ‌ప‌డాల్సి వ‌స్తుంద‌నే వాస్త‌వాన్ని గ్ర‌హించి ఉంటే ర‌ఘురామ‌కృష్ణంరాజు కూడా నోటిని అదుపులోకి పెట్టుకునేవారేమో అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.