ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి లంచ్ భేటీ కావడం ఎల్లో బ్యాచ్‌కు బాగా నొప్పి కలిగిస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజా వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. జగన్‌తో చిరంజీవి భేటీ కావడం వల్ల పవన్‌కు నష్టం కలిగిస్తున్నారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అదే మాటను పరోక్షంగా చెబుతుండడం గమనార్హం.
జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించే పని అన్నయ్యగా చిరంజీవి చేయరని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌తో చిరు కీలక భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై పోరాడుతున్న పవన్ కల్యాణ్‌కు చిరంజీవి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఇకపై సీఎం విందుకు చిరంజీవి వెళ్లాల్సిన పనిలేదని రఘురామ ఉచిత సలహా ఇచ్చారు.
వారం లేదా పది రోజుల్లో మరోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతామని చిరంజీవి గురువారం మీడియాకు చెప్పిన నేపథ్యంలో రఘురామ ఉచిత సలహా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి ఎక్కడ కలుద్దామని తాను జగన్‌ను అడగ్గా…ఎక్కడో ఎందుకు? భోజనానికి కలుద్దామని సీఎం ఆత్మీయంగా అన్నట్టు చిరు వెల్లడించారు. దీంతో జగన్‌తో చిరు భేటీపై రఘురామ అసంతృప్తి వ్యక్తం చేశారు.
చిరంజీవి చెబితే తప్ప…సీఎంకు సినిమా రంగం కష్టాలు తెలియవా? అని రఘురామ ప్రశ్నించారు. ఎలాగైనా సీఎంతో సినిమా పరిశ్రమకు సయోధ్య కుదరకూడదనే దురుద్దేశాన్ని కొందరు బహిరంగంగా, మరికొందరు అంతర్గతంగా వ్యక్తపరుస్తుండడం విశేషం.