మొన్నటివరకు ఎగిరెగిరి పడ్డారు. సోషల్ మీడియాలో, బాబు అనుకూల మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేశారు. సీఎం జగన్ ని, వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ ఎమ్మెల్యేలని అనరాని మాటలన్నారు. సీఐడీ విచారణతో రఘురామ ఎపిసోడ్ కి దాదాపుగా ఫుల్ స్టాప్ పడింది. కోర్టు జోక్యంతో రఘురామ దూకుడు బాగా తగ్గింది. ప్రస్తుతం ఆయన మన్నుతిన్న పాములాగ మారారు. మీడియాలో ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు. కేవలం ఉత్తరాలు రాస్తూ మమ అనిపిస్తున్నారు.
లాఠీలతో కొట్టారు, హింసించారు అంటూ పోలీసులపై తిరగబడ్డ రఘురామరాజు వ్యవహారం పూర్తిగా కామెడీగా మారిపోయింది. షుగర్ ఎక్కువై పాదాలు వాస్తే, తన నటనా చాతుర్యంతో ఏకంగా పోలీసులపైనే రివర్స్ అయ్యారు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారు. కానీ వైద్య పరీక్షల్లో నిజం తేలేసరికి సైలెంట్ అయ్యారు, తప్పుడు ఆరోపణలతో ఇటు జనాల్లోనూ పలుచన అయ్యారు. ఆ తర్వాత సెల్ ఫోన్ ఎపిసోడ్ లో కూడా అభాసుపాలయ్యారు.
ఇప్పుడు రఘురామ రాసే లెటర్లు కానీ, ఆయన కామెంట్లపై కానీ ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. చంద్రబాబు అనుకూల మీడియా మాత్రమే ఇంకా ఆయన పెయిడ్ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేస్తూ తమ స్థాయి దిగజార్చుకుంటోంది.
ఇప్పటికే సీఎం జగన్ కి ఏడెనిమిది ఉత్తరాలు రాశారు రఘురామకృష్ణంరాజు. ఆయన రాసే ప్రతి ఉత్తరంలోనూ ఎంతో కొంత నిజాయితీ ఉంది. అయితే అదే సమయంలో ఆ 10 శాతం లోపాలు, 90శాతం జగన్ విజయాలన్ని జనాలకు చాటి చెబుతున్నాయి.
ఒకరకంగా ఆయన రాసే ఉత్తరాలు సీఎం పనితీరుకి పరోక్షంగా ప్రమోషన్ లా మారాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే సమయంలో టీడీపీ గతంలో చేసిన తప్పుల్ని జగన్ చేయడంలేదనే విషయాన్ని జనం గ్రహించగలుగుతున్నారు.
పైగా రఘురామ రాసిన ఉత్తరాల్లోని అంశాలన్నింటినీ రాబోయే రోజుల్లో జగన్ కచ్చితంగా అమల్లోకి తీసుకొస్తారు, ఆ హామీల్ని నెరవేరుస్తారు. కాకపోతే రఘురామ కాస్త ముందుగా ఉత్తరాలతో విమర్శలందుకున్నారు. అంతే తేడా.
మాటల నుంచి రాతలకు మారిన రఘురామ, కొన్నాళ్లకు అది కూడా తగ్గించుకుని మనసులోనే మథనపడే రోజులు వస్తాయని అంటున్నారు. అంటే ఆయన ఎపిసోడ్ ఇక జీడిపాకంలా సాగదన్నమాట. మరో మూడేళ్లు పోరాడే ఓపిక ఆయనలో ఎలాగూ లేదు.
అటు బీజేపీకి రఘురామ అవసరమూ లేదు. వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మ లేకుండా గెలిచే సీన్ కూడా ఆయనకు లేదు కాబట్టి ఇక శేష జీవితమంతా మౌనరాగం తీయాల్సిందే.