రాహుల్.. ఫిట్ నెస్ ఓకే, అంత ఓపిక ఉందా?

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని, భారీఎత్తున పాదయాత్రకు లేదా మరో రూపంలో ప్రజలను కలవడానికి బయల్దేరబోతున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అంతఃపురాన్ని…

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని, భారీఎత్తున పాదయాత్రకు లేదా మరో రూపంలో ప్రజలను కలవడానికి బయల్దేరబోతున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అంతఃపురాన్ని దాటడంలేదు. టెన్ జన్ పథ్ వేదికగానే కాంగ్రెస్ రాజకీయం ఆసాంతం సాగుతూ ఉంది. అధికారం ఉన్నన్ని రోజులూ అక్కడ నుంచినే అన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రజలు అనే వారితో ఏ మాత్రం సంబంధం లేకుండా సోనియాగాంధీ, రాహుల్ లు అక్కడ నుంచి పాలన సాగించారు. అధికారం ఉన్నప్పుడు అలాంటి తీరుతోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడి వరకూ తెచ్చుకుంది. ఐదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ కోలుకోలేకపోయింది.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ తీరులో మార్పు రాబోతోందట! తమను జనాలు ప్రత్యామ్నాయంగా మరిచిపోతున్నారని కాంగ్రెస్ గుర్తించినట్టుగా ఉంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నే ప్రజలు ఎన్నుకుని తీరాలన్న పరిస్థితి కనుమరుగు అవుతోందని.. ఇకనైనా మేలుకోకుంటే కష్టమని కాంగ్రెస్ గ్రహించిందట. అందుకే రాహుల్ గాంధీ ఒక సుదీర్ఘ యాత్రకు రెడీ కాబోతున్నాడట.

మరి రాహుల్ వయసు, ఫిట్ నెస్ రీత్యా చూస్తే ఆయన చేయగలరు. సుదీర్ఘ పాదయాత్ర లేదా బస్సుయాత్రను రాహుల్ చేపట్టగలరు. అయితే రాహుల్ కు బాడీ ఫిట్ నెస్ ఉంది కానీ ఆయన అలాంటి యాత్రలకు మానసికంగా రెడీగా ఉన్నారా అనేదే కొశ్చన్ మార్క్.

రాహుల్ ది కార్పొరేట్ లైఫ్ స్టైల్. అప్పుడప్పుడు వెకేషన్లు విరామాలు కోరుకుంటాడు. విదేశీ విహారాలకో లేకపోతే దేశంలోనే ఏదైనా జనంసంచారం తక్కువగా ఉండే విడిదుల్లోకో వెళ్ళి విశ్రమించాలని కోరుకుంటారు. ఏదో అమేథీకి వెళ్లి ఒకటీ రెండురోజులు పూరి గుడిసెల్లోకి వెళ్లి ఫొటోలు దిగడంవరకూ ఓకే కానీ, అంతకుమించి రాహుల్ కష్టపడగలరా? అనేదే సందేహం.

కాంగ్రెస్ తరఫున గత కొన్ని దశాబ్దాల్లో విస్తృతంగా జనాల్లోకి వెళ్లినవారు ఎవరూలేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం చేపట్టిన నేత దేశం మొత్తంమీద కూడా లేరు. అందుకే ఆ పార్టీ క్రమక్రమంగా కృశించిపోతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ ఏం చేయబోతున్నారనేదే ఆ పార్టీ భవితవ్యాన్ని  నిర్దేశించబోతోందని  పరిశీలకులు అంటున్నారు.

దాడులపై బాబు మౌనం.. ఓటమికి ఇది కూడా కారణమే