వందల ఎకరాల భూముల రికార్డులు మాయం కావడం అన్నది సామాన్యమైన విషయం కానే కాదు. అది కూడా దేవదేవుడు సింహాద్రి అప్పన్న ఆలయానికి చెందిన పవిత్ర భూములను కబ్జా కోరులకు అనుకూలంగా చేస్తూ భూ మాయ చేసిన వారి సంగతి తేల్చాలని వైసీపీ సర్కార్ గట్టిగానే పట్టుబడుతోంది.
ఇందులో భాగంగా 2016 ప్రాంతంలో సింహాచలం భూములు 846 ఎకరాలు ఎలా మాయం అయ్యాయన్న దాని మీద ఇప్పటికే దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీన ద్వారా శాఖాపరమైన విచారణ జరిపించింది. ఫలితంగా నాటి ఈవో రామచంద్ర మోహన్ ని సస్పెండ్ చేసింది కూడా.
ఇపుడు ఏకంగా విజిలెన్స్ ఎంఫోర్స్ మెంట్ అధికారులతో సమగ్రమైన విచారణ జరిపించాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. మరింత లోతుగా విచారణ జరిపితే అనేక ఇతర విషయాలూ, కీలకమైన వాస్తవాలు బయటకు వస్తాయని అధికారులు అంటున్నారు.
మొత్తానికి రామచంద్ర మోహన్ మెడకు ఈ కేసులు ఉచ్చు గట్టిగానే బిగుసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.