సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చల్లని చూపు కోసం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరాట పడుతున్నాడు. గతంలో టీడీపీ రాజ్యసభ్య సభ్యుడిగా రమేష్ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభలో ప్రధాని మోడీ కాళ్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పడ్డాడని, ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందని ఢిల్లీ వేదికగా సార్వత్రిక ఎన్నికల ముందు సీఎం రమేష్ చిత్రవిచిత్ర హావభావాలతో నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో, ఇదే సీఎం రమేష్ ఆగమేఘాలపై బీజేపీలో చేరాడు. జగన్ సర్కార్ సీఎం రమేష్‌కు సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించి పెద్ద మొత్తంలో బిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అతను వైసీపీ సర్కార్‌తో సాన్నిహిత్యం కోసం పరితపిస్తున్నాడు. రెండ్రోజుల క్రితం జగన్‌కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. గతంలో ఏ రోజూ జగన్‌కు ఇలా చెప్పిన దాఖలాలు లేవు. ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి వెళ్లిన సీఎం జగన్‌కు సీఎం రమేష్ శుభాకాంక్షలు చెప్పాడు.
నేరుగా హెలీప్యాడ్ వద్దకెళ్లి జగన్‌కు శాలువా కప్పి సన్మానించాడు. రమేష్‌తో జగన్ నవ్వుతూ మాట్లాడడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. పెండింగ్ బిల్లులు మంజూరు చేసుకునేందుకు జగన్ చల్లని చూపు కోసం రమేష్ తపిస్తున్నాడనే వాదన వినిపిస్తోంది. ఎంతైనా రమేష్ గతమంతా మరిచి… వ్యాపారి అనిపించుకున్నాడబ్బా.