డీ మానిటైజేషన్ అట్టర్ ఫ్లాప్.. మోడీకి ఆర్బీఐ షాక్!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక మోడీ ప్రభుత్వానికి షాకిచ్చేలా ఉంది. ఏయే లక్ష్యాలను పెట్టుకుని అయితే మారకంలోని నోట్లను రద్దు చేసినట్టుగా ప్రకటించారో అవేవీ నెరవేరలేదని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక మోడీ ప్రభుత్వానికి షాకిచ్చేలా ఉంది. ఏయే లక్ష్యాలను పెట్టుకుని అయితే మారకంలోని నోట్లను రద్దు చేసినట్టుగా ప్రకటించారో అవేవీ నెరవేరలేదని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. నోట్లరద్దు చేసినప్పుడు ప్రధానంగా చెప్పిన వాటిల్లో దొంగనోట్లను అరికట్టడం అనే లక్ష్యం కూడా ఉంది. అయితే రిజర్వ్ బ్యాంక్ తాజాగా తేల్చింది ఏమిటంటే.. 2018-19 సంవత్సరాలకు బోలెడన్ని దొంగనోట్లు మారకంలోకి వచ్చాయనేది!

దొంగనోట్లను అరికట్టడానికి కొత్త నోట్లను తెచ్చినట్టుగా మోడీ సర్కారు చెప్పుకోగా.. ఈ కొత్త వాటికి కూడా దొంగనోట్లు వచ్చాయని ఆర్బీఐ స్పష్టంచేస్తోంది. మరి ఇందుమూలంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? డీ మానిటైజేషన్ లక్ష్యం ఎక్కడ నెరవేరినట్టు? ఇక ప్రజలను ఇక్కట్ల పాల్జేస్తూ క్యాష్ క్రంచ్ సృష్టించినా.. లావాదేవీలు మాత్రం నోట్ల రూపంలోనే ఎక్కువగా సాగుతున్నాయని, ఆర్బీఐ తేల్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది కాలంలో నోట్ల మారకం మరింత పెరిగిందని.. డిజిటల్ లావాదేవీలను పెంచాలనే లక్ష్యం నెరవేరుతున్నట్టుగా కూడా లేదని ఆర్బీఐ వివరించింది.

అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాదిలో కరెన్సీ నోట్ల ద్వారా జరిగిన లావాదేవీలు ఆరుశాతం పెరిగాయట! ఏటీఎంలను మూతవేయిస్తూ, వాటిల్లో డబ్బులు లేకుండా చేస్తూ బ్యాంకులు సామాన్యులను అయితే ఇబ్బంది పెడుతున్నాయి. కానీ నోట్ల లావాదేవీలు మాత్రం గతంతో పోలిస్తే పెరిగాయని స్వయంగా ఆర్బీఐ చెబుతోంది.

ఇందుమూలంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఇక్కట్లు అన్నీ సామాన్యులకే అని, నల్లధనికులు మాత్రం తమ పనిని నోట్ల ద్వారా పూర్తి చేసుకుంటున్నారని తేటతెల్లం అవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఆర్బీఐ నివేదికలోనే ఇలాంటి విషయాలను పేర్కొన్నారంటే, డీ మానిటైజేషన్ ఫలితాలు ఏమిటో మరి!

శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే!