మొత్తానికి అమ్మాయి అధికారాన్ని గుర్తించారుగా…?

కొన్ని విషయాలు అంత తొందరగా ఒప్పుకోవడానికి వయసు పెద్దరికం అడ్డువస్తాయి. కానీ కాలం మారుతుంది. తరాలు కూడా ముందుకు జరుగుతూంటాయి. ఈ తేడాను అర్ధం చేసుకోవడంలో తడబాడు పడితేనే ఇబ్బంది. ఇదంతా ఎందుకంటే విజయనగరం…

కొన్ని విషయాలు అంత తొందరగా ఒప్పుకోవడానికి వయసు పెద్దరికం అడ్డువస్తాయి. కానీ కాలం మారుతుంది. తరాలు కూడా ముందుకు జరుగుతూంటాయి. ఈ తేడాను అర్ధం చేసుకోవడంలో తడబాడు పడితేనే ఇబ్బంది. ఇదంతా ఎందుకంటే విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ అంటూ పేర్కొన్న  కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తన అన్న కుమార్తె సంచయిత అధికారాలను ఎట్టకేలకు గుర్తించారని  అంటున్నారు.

వివాదాలు మాన్సాస్ ట్రస్ట్ కి ఉన్నాయా, లేక వివాదాలు కావాలని చేస్తున్నారా అన్నది కాసేపు పక్కన పెడితే ఏడు నెలలుగా చైర్ పర్సన్ గా సంచయిత తీసుకుంటున్న నిర్ణయాల మీద రాజకీయ విమర్శలు తప్ప ట్రస్ట్ నుంచి ఒక్క‌ చిన్న మాట కూడా రాలేదంటే ఆమె దక్షతను మెచ్చాల్సిందే.

ఈ ఏడు నెలల కాలంలో ఆమె మతం, కులంతో పాటు, లింగ వివక్షను కూడా ఎత్తి చూపారు. సింహాచలం లాంటి చోట ఆలయ పవిత్రతకు ఏదో జరిగిపోతోందని కూడా గగ్గోలు పెట్టారు. ఎవరు ఎన్ని అన్నా కూడా సంచయిత ధీటుగానే బదులిస్తూ తన సమర్ధతను చాటుకున్నారు.

ఇక సింహాచలం దేవస్థానానికి 53 కోట్ల నిధులు ప్రసాదం స్కీం కింద తేవడంలో సంచయిత పాత్రను కాదనలేరు. మరో వైపు మాన్సాస్ ట్రస్ట్ భూముల విషయంలో క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నట్లుగా సంచయిత చెప్పుకుంటున్నారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులకు పాత బకాయి జీతాల చెల్లింపు విషయంలో చొరవ చూపానని చెబుతున్నారు.

ఇక మాన్సాస్ ట్రస్ట్ కు  ఆరున్నర కోట్లు తన బాబాయ్ అశోక్ గజపతిరాజు హయంలో ప్రభుత్వం నుంచి రానీయకుండా డిస్కౌంట్ గా చంద్రబాబుకు ఇచ్చారంటూ ఆమె చేసిన తాజా ఆరోపణ మంట పుట్టించేదే.  తాను ఆ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం నుంచి తీసుకువస్తానని కూడా అంటున్నారు. మొత్తానికి బాబాయి చేసిన  ఆరోపణలకు అమ్మాయి సమాధానం చెబుతూనే  జనాలకు కూడా  వివరణ ఇస్తున్నారనుకోవాలి.

గల్లీలో చక్రం తిప్పే పనిలో బాబు బిజీ