ఇంతకీ గుర్తుందా… ఆ హామీ… ?

ఉమ్మడి ఏపీని రెండుగా చేసినపుడు ఎన్నో హామీలు ఇచ్చారు. విభజన చట్టంలో కూడా చాలా వాటిని పొందుపరచారు. వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఏటా ఆర్ధిక సాయం చేయాలని కూడా ప్రతిపాదించారు. Advertisement ఇక…

ఉమ్మడి ఏపీని రెండుగా చేసినపుడు ఎన్నో హామీలు ఇచ్చారు. విభజన చట్టంలో కూడా చాలా వాటిని పొందుపరచారు. వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఏటా ఆర్ధిక సాయం చేయాలని కూడా ప్రతిపాదించారు.

ఇక ఉత్తరాంధ్రాకు బుందేల్ ఖండ్ ప్యాకేజీని ప్రత్యేకంగా అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఏడేళ్ళు అయినా కూడా ఏ ఒక్క హామీ నెరవేరలేదని ఉత్తరాంధ్రా రాష్ట్ర సమితి ప్రతినిధులు విమర్శిస్తున్నారు.

మూడు జిల్లాలు అన్ని విధాలుగా వెనకబడి ఉన్నాయని, కానీ కేంద్రం మాత్రం విభజన హామీలను అమలు చేయడంలేదని వారు అంటున్నారు. వెంటనే బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఈ హామీలు ఏలిన వారికి అసలు గుర్తున్నాయా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఉత్తరాంధ్రాకు ఆశాకిరణంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్నే చిదిమేస్తున్న నేపధ్యంలో వేల కోట్ల రూపాయల‌ను ప్యాకేజ్ రూపేణా గుమ్మరించే ఔదార్యం ఏలిన ప్రభువులకు ఉంటుందా అన్నదే చర్చ. ఆ విధంగా చేస్తే మాత్రం అద్భుతం జరిగినట్లుగానే భావించాలి.