జ‌గ‌న్‌ను చుల‌క‌న చేయ‌బోయి…!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంధించిన అస్త్రం …తిరిగి ఆయ‌న‌పైన్నే ఎదురు తిరిగింది. కేసీఆర్ టైం బాగా లేద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పేరు…

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంధించిన అస్త్రం …తిరిగి ఆయ‌న‌పైన్నే ఎదురు తిరిగింది. కేసీఆర్ టైం బాగా లేద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించకుండానే… ఆయ‌న్ను చుల‌క‌న చేసేందుకు కేసీఆర్ య‌త్నించి చివ‌రికి ఆయ‌న అభాసుపాల‌య్యార‌నే అభిప్రాయాలు వెల్లువెత్తు తున్నాయి.

ఇటీవ‌ల టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగిస్తూ ‘దళితబంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయి. ఆంధ్రాలో పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారు’ అని అన్నారు.

కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి పేర్ని నాని దీటైన కౌంట‌ర్ ఇచ్చారు. టీఆర్ఎస్ శ్రేణుల‌ను నోరు మూయించేలా పేర్ని నాని అన్న మాట‌లు ఏంటంటే…

‘ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ పెట్టాలని మేమూ కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ, తెలంగాణ ఒకటే రాష్ట్రంగా ఉండాలని సీఎం జగన్ గతంలోనే కోరుకున్నారు. రెండు రాష్ట్రాలు కలిపేస్తే మంచిదే కదా’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.  

కేసీఆర్ కామెంట్స్‌, వాటికి పేర్ని నాని ఇచ్చిన కౌంట‌ర్‌ను టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి రాజ‌కీయంగా వాడుకునేందుకు య‌త్నించారు. హుజూరాబాద్ ఎన్నిక‌ల ముంగిట కేసీఆర్‌ను బ‌ద్నాం చేసేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని రేవంత్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ మాట‌ల‌నే తిరిగి ఆయ‌న‌పైకి ట్విట‌ర్ వేదిక‌గా రేవంత్ సంధించారు.

‘సీఎం కేసీఆర్‌ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది. తెరాస ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం.. కేసీఆర్‌, జగన్‌ ఉమ్మడి కుట్రకు నిదర్శనం. ఏపీ మంత్రి పేర్ని నాని సమైక్యాంధ్ర ప్రతిపాదన చేయడం ఆ కుట్రలో భాగం. వందల మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ జోలికి రావొద్దు’ అని రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. 

జ‌గ‌న్‌ను ఏదో చేయాల‌నుకుని, ఆ గోతిలో కేసీఆరే ప‌డ్డార‌నేందుకు ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాల‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.