బిహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నట్టుగా ఉన్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ కూటమి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో, ప్రారంభ ట్రెండ్స్ లో ఆర్జేడీ కూటమి ముందుంది. ఎన్డీయేకూ, హంగుకు అవకాశం లేకుండా.. ఆర్జేడీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ట్రెండ్సే కొనసాగితే.. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.
ఇప్పటి వరకూ వెల్లడైన ఫలితాలను గమనిస్తే.. ఎన్డీయే కూటమికి రెట్టింపు స్థానాల్లో ఆర్జేడీ కూటమి ఆధిక్యతలో ఉంది. ఆర్జేడీ కూటమి దాదాపు 63 స్థానాల్లో లీడ్ లో ఉండగా, ఎన్డీయే కూటమి 30 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. వంద స్థానాల ఫలితాలకు సంబంధించి ఆధిక్యతలు ఇలా ఉన్నాయి. మొత్తం 243 స్థానాల ఫలితాలకు ఇదే ట్రెండ్స్ నే ప్రాతిపదికగా తీసుకుంటే.. 150 స్థానాల వరకూ ఆర్జేడీ కూటమి సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఆర్జేడీ కూటమిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా బాగానే కనిపిస్తూ ఉంది. ఈ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో, లెఫ్ట్ పార్టీలు నాలుగు స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.