ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నగరి ఎమ్మెల్యే ఈగ కూడా వాలనివ్వరు. వైఎస్ జగన్‌కు మొదటి నుంచి స్ట్రాంగ్ సపోర్టర్‌గా నిలుస్తూ వస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో కూడా ప్రతిపక్ష నేతలపై బలమైన విమర్శల పంచ్‌లు వేస్తున్నారామె. తాజాగా జనసేనాని పవన్‌కల్యాణ్‌పై విమర్శల బాణాలు సంధించారు.
తిరుమల శ్రీవారిని సోమవారం ఆర్కే రోజా సందర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకులతో జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తడంతో పాటు ప్రత్యర్థులపై తెగడ్తలతో విరుచుకుపడ్డారు.
‘మా అన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. రాఖీ పండగ సందర్భంగా మహిళల భద్రతకు మరో అడుగు ముందడుగు వేశారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామం’ అని అన్నారు.
ఎప్పుడూ చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలతో దూకుడు ప్రదర్శించే…ఈ దఫా మాత్రం పవన్‌కల్యాణ్‌పై కూడా ఆరోపణలు చేశారు. యధా ప్రకారం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
‘గాజువాకలో పవన్ కల్యాణ్‌ని చిత్తుగా ఓడించారు. అందుకే వైజాగ్‌పై పవన్ కసి పెంచుకున్నారా? చంద్రబాబు తన బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ఓ సెంటిమెంట్ నిరూపించుకోవాలంటే ఎవరైతే ఆ సెంటిమెంట్ నమ్ముతారో వారు రాజీనామా చేసి చిత్తశుద్ధి చూపించాలి. చంద్రబాబు చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని రోజా అన్నారు. మొత్తానికి మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న పవన్‌కల్యాణ్‌పై రోజా తనదైన స్టైల్లో సరికొత్త విమర్శలు చేసి రాజకీయ వేడి రగిల్చారు.