జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వైసీపీ ఫైర్‌బ్రాండ్, సీనియర్ నటి ఆర్కే రోజా తన మార్క్ పంచ్‌లు విసిరారు. భీమ్లానాయక్ సినిమా విడుదల నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మెగా బ్రదర్ నాగబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రోజా దీటైన సమాధానం ఇచ్చారు.
భీమ్లానాయక్ సినిమా టికెట్‌ను రూ.150కి విక్రయించారన్నారు. దీని వల్ల సినిమాకు వచ్చిన నష్టం ఏంటని రోజా ప్రశ్నించారు. అయినా నష్టపోవడానికి పవన్‌కల్యాణ్ ఏమైనా నిర్మాతనా? డిస్ట్రిబ్యూటరా? అని రోజా ప్రశ్నించారు.
పుష్ప, అఖండ సినిమాలకు ఏ విధంగా అయితే టికెట్ రూ.150కు అమ్మారో, పవన్‌కల్యాణ్ సినిమా విషయంలోనూ ప్రభుత్వం నిబంధనలు అమలు చేసిందన్నారు.
నిజానికి సినిమా టికెట్ల ధరలు, ఇతర సమస్యలపై ఈ నెల 21న ప్రభుత్వం సమావేశమై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉండిందన్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మృతితో ఆ నిర్ణయం వాయిదా పడిందన్నారు. త్వరలోనే సినిమా సమస్యలకు ఓ పరిష్కారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.