తన ప్రకటనకు చింతిస్తున్నట్టు అందాల ఆటగత్తె, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొన్నారు. సొగసైన ఆటతో పాటు అందంతో కొన్నేళ్లుగా క్రీడాకారుల మనసులను సానియా మీర్జా దోచుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తానీ క్రికెట్ ఆటగాడిని పెళ్లి చేసుకున్నారామె. ఆమె పెళ్లి అప్పట్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మొదట హైదరాబాదీ యువకుడితో నిశ్చితార్థమై, అనంతరం రద్దైంది.
ఆ తర్వాత కొంత కాలానికి పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో సానియా ప్రేమలో పడ్డారు. పెళ్లైన తర్వాత కూడా ఇద్దరూ తమతమ దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు. 35 ఏళ్ల సానియా మీర్జా రెండురోజుల క్రితం తన రిటైర్మెంగ్పై ప్రకటించారు. ఈ ప్రకటన చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సానియా మరోసారి రిటైర్మెంట్పై తనదైన స్టైల్లో స్పందించారు.
తాను అలా ప్రకటించకుండా ఉండాల్సిందని సానియా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గమనార్హం. ఆ విషయంలో తొందరపడి నట్లుగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలగిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్య చేశారు.
‘ఇప్పుడు అంతా నా ఆట గురించి కాకుండా రిటైర్మెంట్ తర్వాతి విషయాలపైనే మాట్లాడుతున్నారు. దాని గురించే అడుగుతున్నారు. రిటైర్మెంట్ తర్వాతి అంశాల గురించి నేను అసలు ఆలోచించడమే లేదు. నిజాయితీగా చెప్పాలంటే రిటైర్మెంట్ గురించి నేను చాలా తొందరపడి ప్రకటన చేశాను. ఇప్పుడు దానికి నేను చింతిస్తున్నాను’ అని సానియా మీర్జా ఆవేదన వ్యక్తం చేశారు.