ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లు పునఃప్రారంభం అయ్యాయి. ఏపీలో ప్రైమరీ స్కూళ్లను కూడా తెరిచింది ప్రభుత్వం. పక్కనున్న కర్ణాటకలో కాలేజీలను ఈ నెల ఆరంభంలోనే ప్రారంభించారు. స్కూళ్లను రీ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ సమాయత్తం అవుతున్నారు.
ఇంకా వివిధ రాష్ట్రాల్లో స్కూళ్లను పునఃప్రారంభించడం గురించి తేదీలను ప్రకటిస్తూ ఉన్నారు. తమిళనాడులో సెప్టెంబర్ ఒకటి నుంచి స్కూళ్లను రీ ఓపెన్ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. తొమ్మిది నుంచి ఆ పై తరగతుల పిల్లలకు విద్యాలయాలను ఓపెన్ చేయనున్నట్టుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఇక ఈ నెల 23 నుంచి హైస్కూళ్లను, సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రైమరీ స్కూళ్లను తెరవడానికి యూపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా దేశంలోని ఒక్కో రాష్ట్రం స్కూళ్లను తెరవడం గురించి ముందడుగులు వేస్తున్నాయి.
ఒకవైపు కరోనా మూడో వేవ్ హెచ్చరికలైతే ఉన్నాయి. అయితే ఇక ఎక్కువ కాలం స్కూళ్లను క్లోజ్ చేసి ఉంచడం ఏ రకంగానూ మంచిది కాదని నిపుణులు ప్రస్తావిస్తూ ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా ధైర్యే సాహసే లక్ష్మి అంటున్నాయి. ఒక్కో రాష్ట్రం స్కూళ్లను రీ ఓపెన్ చేయడంపై దృష్టి పెట్టాయి.