బాలీవుడ్ ప్రస్తుత ప్రేమకథల్లో ఒకటి కత్రినాకైఫ్- విక్కీ కౌశల్ ది. కత్రినా ఇది వరకటి ప్రేమకథల కంటే గాఢంగా సాగుతున్నట్టుగా ఉంది ఈ ప్రేమకథ. గతంలో రణ్ భీర్ కపూర్ తో కలిసి కత్రినా సహజీవనం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ ప్రేమకథ పెళ్లి దిశగా సాగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కానీ.. ఆ జంట విడిపోయింది.
కత్రినాకు సంబంధించిన ఫ్లాట్ లోనే ఆమెతో సహజీవనం చేసిన రణ్ భీర్ తమ ప్రేమ కథ ముగిశాకా.. అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రణ్ భీర్ కపూర్ అలియా భట్ తో ప్రేమ వ్యవహారాన్ని సాగిస్తుండగా.. ప్రస్తుతం కత్రినా కూడా లీడింగ్ లో ఉన్న విక్కీ కౌశల్ తో ప్రేమాయణాన్ని సాగిస్తున్నట్టుగా ఉంది.
ఈ విషయాన్ని వీరి సహచర నటులే ధ్రువీకరిస్తున్నారు. కత్రినా, విక్కీలు కలిసి ఉంటుండటం వాస్తవమేనంటూ బాలీవుడ్ నటులు చాట్ షోల్లో వ్యాఖ్యానించిన దాఖలాలున్నాయి. ఇలా వీరి ప్రేమకథను బాలీవుడ్ జనాలు ధ్రువీకరిస్తున్నారు. అయితే వీరి బంధం అంతకు మించి ముందుకు సాగింది మాత్రం లేదని కూడా వారే చెబుతున్నారు.
కత్రినా- విక్కీ కౌశల్ లకు ఎంగేజ్ మెంట్ జరిగిందని, పెళ్లి ఆలోచనతో వీరు ఇప్పటికే ఎంగేజ్డ్ అయ్యారనే రూమర్లు కూడా వినిపించాయి. అయితే అవి కేవలం రూమర్లు మాత్రమే అని స్పష్టం అవుతోంది. వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారని, కలిసి ఉండటం వాస్తవమే అయినా.. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నది మాత్రం అబద్ధమని వీరిని బాగా ఎరిగిన వారు అంటున్నారు. గతంలో రణ్ భీర్ తో చాలా కాలమే సహజీవనాన్ని చేసిన కత్రినా, ఆ ప్రేమకథను పెళ్లి వరకూ తీసుకెళ్లలేకపోయింది. మరి విక్కీ కౌశల్- కత్రినాల బంధం సహజీవనం వరకూ వచ్చినా, అంతకు మించి వీరి బంధంలో కొత్త విషయాలు లేవని వీరి సన్నిహితులు అంటున్నారు.