ఈరోజుల్లో ఏ సినిమా మీద అయినా వివాదం చెలరేగితే ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్లే లెక్క. ఈలెక్కన క్రేజీ అంకుల్స్ కు కూడా అలాంటి చాన్స్ దొరికింది.
ఈ సినిమాను అడ్డుకుంటామంటూ, తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శులు కార్యదర్శి రత్నా హెచ్చరించారు. క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ లో మహిళలను కించ పరిచే సన్నివేశాలున్నాయని ఆమె ఆరోపించారు.
బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం రేపు విడుదల కానుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర అంకుల్స్ పాత్రల్లో నటించారు.
ఇప్పటికిప్పుడు సినిమాను ఆపేయడం సాధ్యం కాదు. అడ్డుకోవడం అంతకన్నా సాధ్యమయ్యేదీ కాదు. అందువల్ల క్రేజీ అంకుల్స్ ను జనంలోకి తీసుకెళ్లడానికి ఇలాంటి ప్రకటనలు మరింతగా పనికి వస్తాయి. శ్రీముఖితో పాటు మనో, రాజా రవీందర్, బండ్ల గణేష్ తదితరులు ఈ సినిమాలో నటించారు.