తెలుగు తెరకు మరో వెర్సటైల్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి. నిజానికి అందరూ యూత్ ఫుల్, రొమాంటిక్, మాస్ హీరోలే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ వున్నవాళ్లు వుంటే బాగుంటుంది.
వాళ్లకు తగిన కథలతో వైవిధ్యమైన సినిమాలు వస్తాయి. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో ఇలా ప్రూవ్ చేసుకున్న హీరో నవీన్ పోలిశెట్టి.
ఆ సినిమా హిట్ తరువాత తనకు నప్పే వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటున్నాడు. యువి కాన్సెప్ట్ సంస్థ అనుష్క ప్రధాన పాత్రలో అందించే సినిమాకు నవీన్ నే హీరో. ఇది పూర్తిగా కొత్త తరహా లైన్. ఇప్పుడు ఇలాంటిదే మరో సినిమాకు ఓకె చెప్పేసాడు.
జాతిరత్నాలు రైటింగ్ డిపార్ట్ మెంట్ లో కీలకంగా పని చేసిన కళ్యాణ్ అనే కొత్త దర్శకుడు చెప్పిన లైన్ తో సినిమా చేయబోతున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.