అవుని విశాఖ నందనవమే. ఎటు చూసిన పూల సుగంధాలతో పరిసరాలు గుభాళిస్తాయి. విశాఖలో అతి పెద్ద ఫ్లవర్ పర్క్ ని ఏర్పాటు చేయడానికి విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అధారిటీ తాజాగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కడియం నర్శరీ కంటే కూడా పెద్ద నర్శరీని విశాఖలో ఏర్పాటు చేయనున్నారు.
విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఇందుకోసం ఏకంగా మూడున్నర ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తున్నారు. ఇక్కడ లక్షకు పైగా పూల మొక్కలు ఏర్పాటు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన పుష్ప జాతులను ఏరి కోరి మరీ విశాఖకు తీసుకువస్తారు. ఇలా లక్షల పూలూ ఒకే చోట ఉండడం అంటే చూసేందుకు రెండు కళ్ళూ చాలవనే చెప్పాలి.
ప్రతీ రోజూ ఇక్కడ పూల ప్రదర్శనతో విశాఖకు కొత్త అందాలు తీసుకువచ్చేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఫ్లవర్ పార్క్ లో కేఫిటేరియా, ఫౌంటైన్, చిల్డ్రన్స్ ఎరీనా, ఓపెన్ ధియేటర్, సెల్ఫీ పాయింట్ వంటివి కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
విశాఖ బీచ్ కి కేవలం కిలో మీటర్ దూరం లో ఏర్పాటు చేయనున్న ఈ ఫ్లవర్ పార్క్ సందర్శకులకు అద్భుతమైన వరంగా మారబోతోంది. భవిష్యత్తులో ఫ్లవర్ పార్క్ చక్కని టూరిజం స్పాట్ గా చేయలని కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. ఇక మీదట విశాఖ అంటే బీచ్ కెరటాలే కాదు, పూల సోయగాలు అని కూడా గుర్తుకువచ్చేలా ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ని అధికారులు ముందుకు తెస్తున్నారు.