హీరోలు తమ వారసుల్ని వెండితెరకు పరిచయం చేసే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్లకు రెండేళ్ల నుంచే ట్రయినింగ్ స్టార్ట్ చేస్తారు. ఏడాదిగా కథలు వింటుంటారు. మంచి కాంబినేషన్ సెట్ చేయడానికి అన్నివిధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఎవరైనా ఇలానే చేయాలి, చేస్తారు కూడా. కానీ ఇక్కడో హీరో మాత్రం అవేం చేయడం లేదు. జాతకాలు చూస్తూ కాలం గడిపేస్తూ.. నటవారసుడ్ని గాలికొదిలేశాడు.
ఆ హీరోకు జాతకాల పిచ్చి. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే ముహూర్తం చూస్తాడు. అలాంటి వ్యక్తి తన కొడుకును హీరోను చేసేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తూ, జాతకాల దగ్గరే ఆగిపోతున్నాడు. ప్రతి ఏటా కొడుకు తెరంగేట్రాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. అయితే సదరు హీరో ఇలా వ్యవహరించడానికి కొడుకు జాతకంలో పెద్ద దోషం ఉండడమే కారణం అంటున్నారు దగ్గరి వ్యక్తులు.
సదరు హీరోగారి కొడుకు జాతకంలో శని ప్రభావం చాలా ఎక్కువగా ఉందట. ఇలాంటి టైమ్ లో ముఖానికి రంగేస్తే ఆ రంగు నిలబడదట. కెమెరా ముందుకొస్తే లైటింగ్ సెట్ అవ్వదట. అందుకే కొడుకు ఎంట్రీని అబేయన్స్ లో పడేశాడు సదరు సీనియర్ హీరో. పైకి మాత్రం కొడుకు కోసం కథలు వండుతున్నట్టు, ప్రముఖుల్ని సంప్రదిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడని చెబుతున్నారు.
తండ్రి ప్రభావమో లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ.. ఆ పుత్రరత్నం కూడా యాక్టింగ్, ట్రైనింగ్ అన్నీ పక్కనపెట్టి వ్యక్తిగత జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.