వైఎస్సార్‌టీపీపై వైఎస్ షర్మిల భర్త, బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్లో మీడియా నోళ్లు మూయించేలా ఘాటు సమాధానం ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చెల్లినే కాదు బావను కూడా రెచ్చగొట్టేందుకు ఎల్లో మీడియా వేసిన ఎత్తు చిత్తు అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ షర్మిల పార్టీ పెడుతుందనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ఎల్లో మీడియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమ ప్రచారానికి బలం కలిగించే వ్యాఖ్యల కోసం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.
ఏపీలో పార్టీ స్థాపనపై జరుగుతున్న ప్రచారానికి ఇటీవల వైఎస్ షర్మిల ఫుల్‌స్టాప్ పెట్టింది. అయినప్పటికీ ఎల్లో బ్యాచ్ తన ప్రయత్నాలను ఆపలేదు. ఇటీవల షర్మిల మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎవరైనా, ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చన్నారు. పెట్టకూడదనే రూల్ ఏమీ లేదు కదా అని ప్రశ్నించారు. కానీ తాను తెలంగాణకు బద్ధురాలినై పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. తన రాజకీయం పూర్తిగా తెలంగాణ సమాజంతో ముడిపడి ఉందని తేల్చి చెప్పినా వివాదరాయుళ్లకు నిద్రపట్టడం లేదు.
ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడకు వచ్చిన షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కు మీడియా రాజకీయ ప్రశ్రలు సంధించింది. వాయిస్ ఇవ్వాలని మీడియా కోరగా… దేనికమ్మా అని ఆయన సున్నితంగా ప్రశ్నించారు. ఏపీలో షర్మిల పార్టీ ఏర్పాటుపై మీ అభిప్రాయం ఏంటని మీడియా ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
రాజకీయాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల గురించి అసలు మాట్లాడనని చెప్పడం ద్వారా, తనకు షర్మిల పార్టీతో సంబంధం లేదని బ్రదర్ అనిల్ తేల్చి చెప్పారు. తాను విజయవాడలో పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చినట్టు అనిల్ తెలిపారు.