ఇదో చిత్రమైన కేసులా ఉంది. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన ఆశ్చర్యకరంగా ఉంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఒక కేరళ కుటుంబానికి చెందిన తల్లికూతురు పోలీసులను ఆశ్రయించారు. తన భర్త గురించి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.
అతడి పేరు హార్ధిక్ గాంధీ. ఏదో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతడితో పాటు భార్య, ఆమె తల్లి కూడా ఉంటున్నారు. ఇటీవల ఒక రోజు ఇంట్లోనే మద్యం తాగిన గాంధీ.. నిద్రమాత్రలు వేసుకుని పడుకున్న అత్త మీద అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె ప్రతిఘటించినా ప్రయోజనం లేకపోయింది. అలా పిల్లనిచ్చిన అత్త మీద దుర్మార్గానికి ఒడిగట్టిన అతడు… ఇంట్లోంచి అదే రాత్రే పరార్ అయ్యాడట!
జరిగిన ఘాతుకం గురించి కూతురుకు చెప్పి బోరుమందట ఆ మహిళ. గాంధీకి భార్య ఫోన్ చేయగా.. అతడు క్షమాపణలు కోరాడట. తను ఏదో క్షణికావేశంలో అలా చేసినట్టుగా.. తనను క్షమించాలని కోరాడట. ఆమె అతడిని నిందించగా.. విడాకులు తీసుకుందామని అతడు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. భరణం కూడా కోరినంత ఇవ్వడానికి రెడీ అని చెప్పాడట.
ఆ తర్వాత ఫోన్ స్విఛాఫ్ చేసి భార్యకు అందుబాటులో లేకుండా పోయాడట. దీనిపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి జాడ కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు కఠినమైన చట్టాలు అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే లైంగిక నేరాల విషయంలో మనుషుల్లో మానవత్వం, వావీవరసలు కూడా అగుపించడం లేదు. అలా సాగుతోంది ఈ సమాజం!