శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ నోటి వెంట ఆవేశపూరితమైన మాటలు వచ్చాయి. దిశా యాప్ విషయంలో అవగాహన కల్పించే ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అవుట్ ఆఫ్ లా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
చట్టం ద్వారా పని జరగనపుడు వేరే మార్గాల ద్వారానైనా న్యాయం జరగాలని ఆయన కోరుకోవడం విశేషమే. మహిళల మీద లైంగిక దాడులు దారుణంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన చెందారు.
మహిళను రక్షించాల్సిన మగవాళ్ళే మృగాలుగా ప్రవర్తిస్తూంటే ఈ దేశంలో ఆడవారు ఎలా బతికేది అంటూ తమ్మినేని ప్రశ్నించారు. చట్టప్రకారం ఒక్కోసారి మహిళలకు న్యాయం సరిగ్గా జరగడంలేదన్న భావనను ఆయన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే భారతదేశం సంస్కృతి సంప్రదాయాలను తమ్మినేని గుర్తు చేస్తూ ఈ రోజుకు ఇలాంటివి జరగడం అంటే మన సంప్రదాయాలకే తీరని ఘోర అవమానమని అన్నారు. మొత్తానికి ఆడవారిని కాపాడుకోవాలంటే మృగాళ్ళను ఏమైనా చేయాల్సిందే అంటూ తమ్మినేని చేసిన కామెంట్స్ వెనక ఆవేదననే చూడాలి.