స్పీకర్ రాజధానిని అంత మాట అనేశారే…!!

తమ్మినేని సీతారాం. శాసనసభ స్పీకర్. ఆయన అసెంబ్లీని కూడా తనదైన శైలిలో నడిపిస్తున్నారు. స్పీకర్ గా అసెంబ్లీలో ఉంటూనే బయటకు రాగానే రాజకీయ అవతారం కూడా ఎత్తేస్తున్నారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం కూడా…

తమ్మినేని సీతారాం. శాసనసభ స్పీకర్. ఆయన అసెంబ్లీని కూడా తనదైన శైలిలో నడిపిస్తున్నారు. స్పీకర్ గా అసెంబ్లీలో ఉంటూనే బయటకు రాగానే రాజకీయ అవతారం కూడా ఎత్తేస్తున్నారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం కూడా సమంజసంగా ఉందనే చెప్పాలి.

తాను లక్షలాది ప్రజకు ఎన్నుకున్న ఎమ్మెల్యేని అని, అందువల్ల వారి సమస్యలు తాను కాక ఎవరు పట్టించుకుంటారన్న తమ్మినేని వాదన కూడా కరెక్టే. ఇక ఫిరాయింపుల మీద, గత సర్కార్ పాపాల మీద స్పీకర్ ఎక్కడా దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తున్నారు.

దాంతో టీడీపీ వారికి బాగా కాలిపోతోంది. అయినా స్పీకర్ ఉన్న మాటే అంటున్నారు, అందుకే ఇంత ఉలుకు అని కూడా వైసీపీ నేతలు కూడా  తగులుకుంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే స్పీకర్ చంద్రబాబు కలల రాజధాని అమరావతిని ఎడారి అనేశారు. రాజధానికి వెళ్తూంటే రాజస్థాన్ ఏడారికి వెళ్తున్నట్లుగా ఉందని తమ్మినేని అనేశారు.  రాజధాని అంటే అందరిదీ అనుకోవాలని, కానీ అమరావతి మాత్రం కొందరిదే అన్న భావన ఏర్పడిందని కూడా తమ్మినేని బాగానే సెటైర్లు వేశారు.

ఇక మూడు రాజధానుల జగన్ ప్రతిపాదనకు కూడా స్పీకర్ ఒకే అనేశారు. ఎటువంటి అసమానతలు లేకుండా మూడు ప్రాంతాలు అభివ్రుధ్ధి సాధించాలంటే ఈ నిర్ణయం కంటే మించినది లేదు అని కూడా కుండబద్దలు కొట్టేశారు.

అమరావతి పేరిట జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్  పైన విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించలని కూడా స్పీకర్ గట్టిగా కోరుకున్నారు. మొత్తానికి తమ్మినేని బాగానే తలంటేశారు. ఇక పసుపు పార్టీ పరువు పూర్తిగా పోయినట్లే మరి.