ఏపీలో నవరత్నాలు.. తమిళనాట సప్త వాగ్దానాలు

సీఎం జగన్ నవరత్నాల కార్యక్రమం ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయింది. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను కేరళలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు, ఈశాన్య రాష్ట్రాల నుంచి సైతం అధికారులు వచ్చి…

సీఎం జగన్ నవరత్నాల కార్యక్రమం ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయింది. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను కేరళలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు, ఈశాన్య రాష్ట్రాల నుంచి సైతం అధికారులు వచ్చి సచివాలయ వ్యవస్థ పనితీరు పరిశీలించి వెళ్లారు. మరి పక్క రాష్ట్రం తమిళనాడు వీటిని కాపీ కొట్టకుండా ఉంటుందా.

కాపీ అని కాదు కానీ, జగన్ ని పూర్తి స్థాయిలో స్ఫూర్తిగా గా తీసుకున్నారు డీఎంకే అధినేత స్టాలిన్. ఏపీలో నవరత్నాల కార్యక్రమం లాగానే, తమిళనాట 'స్టాలిన్ 7 ఉరుదిమొళిగళ్' అనే పేరుతో పథకాలను ప్రకటించారు. స్టాలిన్ 7 ఉరుదిమొళిగళ్ అంటే స్టాలిన్ 7 వాగ్దానాలు అని అర్థం. జస్ట్ నెంబర్ మాత్రమే మారింది మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడ నవరత్నాలు, అక్కడ సప్త వాగ్దానాలు.

నవరత్నాల కార్యక్రమం స్ఫూర్తిగానే తమిళనాడు ప్రజలకు సప్త వాగ్దానాలు ఇచ్చారు స్టాలిన్. రైతు దిగుబడుల పెంపుకి చర్యలు, అందరికీ ఉన్నత విద్య, ఉన్నత స్థాయి వైద్యం, ఏటా 10 లక్షల ఉద్యోగావకాశాల కల్పన, మెరుగైన తాగునీటి సరఫరా, హరిత విస్తీర్ణం 25 శాతానికి పెంచడం, సుందర మహానగరాల రాష్ట్రంగా తమిళనాడుని తీర్దిదిద్దడం.. వంటివి ఇందులో ఉన్నాయి.

అంతే కాదు.. మహిళల్ని ఆకట్టుకోడానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబ పెద్ద ఖాతాలో నెలకు వెయ్యి రూపాయలు జమ చేస్తామని కూడా ప్రకటించారాయన. దాదాపుగా ఏపీలో సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలను పోలి ఉన్న సప్త వాగ్దానాలతో తమిళనాట విజయబావుటా ఎగరేయాలనుకుంటున్నారు స్టాలిన్.

జగన్ కు స్టాలిన్ కు ఒక్కటే తేడా..

ఏపీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన ఇద్దరు అతిథుల్లో స్టాలిన్ కూడా ఒకరు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు.. తమిళనాడులో ప్రతిపక్షనేతగా ఉన్న స్టాలిన్, సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇద్దరిలో ఉన్న ఒకే ఒక్క తేడా.. కాంగ్రెస్ తో కలవడం.

కాంగ్రెస్ అంటే అస్సలు గిట్టని నాయకుడు జగన్. అదే కాంగ్రెస్ తో తమిళనాట పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు స్టాలిన్. జగన్ కి నవరత్నాలు కలిసొచ్చినట్టే.. స్టాలిన్ కి 'సప్త వాగ్దానాలు' అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయో లేదో చూడాలి. 

జూ ఎన్టీఆర్ కి 1% రాజకీయ పరిజ్ఞానం ఉన్నా

ఈ సినిమా నా జీవితంలో ఒక ఆణిముత్యం