ఈ వ్య‌వ‌హారం చాలా తీవ్ర‌మైంది

దేశాన్ని కుదిపేస్తున్న పెగాస‌స్ స్పైవేర్ అంశంపై అత్యున్న‌త న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. సుప్రీంకోర్టు తాజా కామెంట్స్ దేశ ప్ర‌జ‌ల భ‌యాందోళ‌న‌ల్ని ప్ర‌తిబింబిస్తున్నాయి. పెగాస‌స్ స్పైవేర్ అంశంపై సుప్రీంకోర్టు గురువారం విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ‌లో…

దేశాన్ని కుదిపేస్తున్న పెగాస‌స్ స్పైవేర్ అంశంపై అత్యున్న‌త న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. సుప్రీంకోర్టు తాజా కామెంట్స్ దేశ ప్ర‌జ‌ల భ‌యాందోళ‌న‌ల్ని ప్ర‌తిబింబిస్తున్నాయి. పెగాస‌స్ స్పైవేర్ అంశంపై సుప్రీంకోర్టు గురువారం విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ…. ‘వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమైనవే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైంది’ అంటూ కీల‌క‌ వ్యాఖ్య‌లు చేసింది.

దేశ వ్యాప్తంగా 300 మంది ప్ర‌ముఖుల‌ను టార్గెట్ చేసుకుని కేంద్ర ప్ర‌భుత్వం పెగాస‌స్‌తో వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించడంపై ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగాయి. తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు కూడా పెగాస‌స్ బారిన ప‌డ్డార‌ని సంచ‌ల‌న క‌థ‌నాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో గ‌త కొన్ని రోజులుగా పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్ని ప్ర‌తిప‌క్షాలు స్తంభింప‌జేస్తున్నాయి. 

పెగాస‌స్‌పై విచార‌ణ‌తో పాటు చ‌ర్చ‌కు ట్టుబ‌డుతున్నాయి. కానీ పెగాస‌స్ అంశం మిన‌హా మిగిలిన వాటిపై చ‌ర్చ‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఓకే అంటోంది. మరోవైపు ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫోన్ల ట్యాపింగ్ చేపడతారని తెలుస‌న్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై ట్యాపింగ్‌కు పాల్ప‌డ్డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. ఇది రాజ్యాంగ హ‌క్కుల్ని హ‌రించ‌డ‌మే అన్నారు.

వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌, గోప్య‌త‌కు భంగం క‌లిగించేలా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను మంగ‌ళ‌వారానికి వాయిదా వేస్తూ…  కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆ రోజు కోర్టుకు హాజరు కావాలని ధ‌ర్మాస‌నం ఆదేశించింది.