గిరిపుత్రులతో తిరుపతికి స్వాత్మానందేంద్ర

హిందూ మతంలో దేవాలయాల తర్వాత పీఠాలకు ప్రత్యేక స్థానం ఉంది. కనిపించే భగవంతుని ప్రతినిధిగా పీఠాధిపతులకు భక్తులలో విశ్వాసం ఉన్నది. ప్రముఖ పీఠాలలో విశాఖ శారదా పీఠం ముఖ్యమైనది. స్వరూపానంద స్వామి నేతృత్వంలో ఈ…

హిందూ మతంలో దేవాలయాల తర్వాత పీఠాలకు ప్రత్యేక స్థానం ఉంది. కనిపించే భగవంతుని ప్రతినిధిగా పీఠాధిపతులకు భక్తులలో విశ్వాసం ఉన్నది. ప్రముఖ పీఠాలలో విశాఖ శారదా పీఠం ముఖ్యమైనది. స్వరూపానంద స్వామి నేతృత్వంలో ఈ పీఠం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  పీఠాలు , పీఠాధిపతులు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండరు అన్న అపవాదు ఉన్నది. అందుకు పూర్తి భిన్నంగా విశాఖ శారదా పీఠం – స్వరూపానంద స్వామి ఉంటారు.

మిగిలిన పీఠాలకు భిన్నంగా స్వరూపానంద స్వామి సాధారణ ప్రజలతో మమేకం అవుతారు. వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. టిటిడిలో మహిళలకు తలనీలాలు అర్పించే కార్యక్రమంలో నియామకం చేయడానికి సన్నాహాలు చేసినప్పుడు ఈ వృత్తిలో మహిళలు ఏమిటి అన్న చర్చ వచ్చింది.

పెద్దలు చాలా మంది సంశయాన్ని వెలిబుచ్చారు. సామాజిక మార్పుకోసం నేరుగా అండగా నిలిచినది స్వరూపానంద స్వామి. అన్ని వర్గాలకు పూజా కార్యక్రమాలు నిర్వహనలో తర్పిదు ఇచ్చే కార్యక్రమానికి టిటిడి తలపెట్టిన సందర్భంలో కూడా వారు అండగా నిలిచారు.

ఉత్తర పీఠాధిపతులుగా బాధ్యతలు చేపట్టిన స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా స్వరూపానంద స్వామి అడుగుజాడల్లో ముందుకు సాగుతున్నారు. మన్యం గ్రామాల్లో పర్యటించి శ్రీవారి దర్శనం కల అనుకునే గిరిపుత్రులతో కలిసి స్వయంగా తిరుమల శ్రీవారి దర్శనానికి స్వాత్మానందేంద్ర సరస్వతి వారు తీసుకువస్తున్నారు.

దళితులకు చాలా దేవాలయాలలో ఆలయప్రవేశం లేకపోవడంతో పెద్ద లోపం. మత మార్పిడులకు ఒక కారణంగా ఉన్నది. హిందూమతంలో ఇలాంటి సమస్య ఉండకూడదు అని చాలా మంది పెద్దలు కృషి చేస్తున్నారు. అలాంటి వరవడిని కొనసాగిస్తూ విశాఖ శారదా పీఠం గిరిపుత్రులతో స్వయంగాఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి వారు శ్రీవారి దర్శనానికి నేడు తిరుపతికి వస్తున్నారు.

దళిత గోవిందం పేరుతో ఉత్సవ మూర్తులను దళిత వాడలకు తీసుకుని వెళ్లడం , అన్ని తరగతుల వారికి అర్చక వృత్తిలో తర్పిదు ఇవ్వడం లాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలను విజయవంతం చేసింది టిటిడి. అలాంటి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల శ్రీవారి దర్శనానికి గిరిపుత్రులతో  వస్తున్న ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి వారికి తిరుపతి ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. 

-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి