ఆ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన తమన్న

అంధాధూన్ సినిమాలో హీరో ఆయుష్మాన్ ఖురానా, విలన్ గా నటించిన టబు మధ్య వయసు తేడా స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఆ సన్నివేశాలు బాగా పండాయి. అదే అంధాధూన్ రీమేక్ మాస్ట్రో విషయానికొచ్చే సరికి…

అంధాధూన్ సినిమాలో హీరో ఆయుష్మాన్ ఖురానా, విలన్ గా నటించిన టబు మధ్య వయసు తేడా స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఆ సన్నివేశాలు బాగా పండాయి. అదే అంధాధూన్ రీమేక్ మాస్ట్రో విషయానికొచ్చే సరికి మాత్రం ఈ ఏజ్ గ్యాప్ తగ్గిపోయింది. 

నితిన్-తమన్న దాదాపు ఒకే వయసు వ్యక్తుల్లా అనిపించారు. దీనికి సంబంధించి కథలో చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ.. నితిన్-తమన్న సీన్స్ పై కొద్దిపాటి విమర్శలు చెలరేగాయి. వీటిపై తమన్న క్లారిటీ ఇచ్చింది.

“మేం రీమేక్ చేస్తున్నాం. నితిన్ అంధుడిగా నటించాలి. నేను టబు పాత్రలో, ఫస్ట్ టైమ్ విలన్ గా చేస్తున్నాను. కాబట్టి మా దృష్టి మొత్తం సీన్స్ ఎలా వస్తున్నాయనే అంశంపైన మాత్రమే పెట్టాం. ముందు 2-3 సీన్లు కలిసి చేశాం. బాగా వచ్చాయని అంతా చెప్పడంతో, అప్పుడు మాపై మాకు నమ్మకం కుదిరింది. ఇక అప్పట్నుంచి పాత్రలకు తగ్గట్టు నటించుకుంటూ వెళ్లిపోయాం.”

మాస్ట్రో నితిన్ సొంత సినిమా. అయినప్పటికీ నితిన్, నిర్మాణ పనుల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ అంధుడిగా నటించడంతో పాటు.. సూపర్ హిట్ రీమేక్ కావడం వల్ల కాస్త ఒత్తిడికి గురయ్యాడని, అందుకే ఫోకస్ మొత్తం యాక్టింగ్ పైనే పెట్టాడని చెప్పుకొచ్చింది తమన్న.

మాస్ట్రో హిట్ అవుతుందా, సక్సెస్ అవుతుందా అనే విషయాన్ని తను ఆలోచించలేదని.. ఓ మంచి క్యారెక్టర్ ను మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతోనే సిమ్రాన్ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలిపింది.