విమర్శకులపై విరుచుకుపడిన మిల్కీబ్యూటీ

ఓవైపు దేశమంతా కరోనా కల్లోలంతో సతమతమౌతుంటే, ఓ సెక్షన్ మాత్రం సెలబ్రిటీలపై ట్రోలింగ్ షురూ చేసింది. ఈ టైమ్ లో సెలబ్రిటీలు ఏం చేయడం లేదని, తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని తిట్ల పురాణం అందుకున్నారు…

ఓవైపు దేశమంతా కరోనా కల్లోలంతో సతమతమౌతుంటే, ఓ సెక్షన్ మాత్రం సెలబ్రిటీలపై ట్రోలింగ్ షురూ చేసింది. ఈ టైమ్ లో సెలబ్రిటీలు ఏం చేయడం లేదని, తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని తిట్ల పురాణం అందుకున్నారు కొందరు. ఇలాంటి వాళ్లపై మండిపడింది తమన్న.

“మేమంతా మా స్థాయిలో సహాయం చేస్తూనే ఉన్నాం. నిజంగా ఏది అవసరమో అది మేమంతా చేస్తున్నాం. నా వరకు నేనైతే చేసిన సహాయాన్ని చెప్పుకోను. కొంతమంది మాత్రం మరింత మందికి స్ఫూర్తిని ఇచ్చేందుకు తాము చేసిన సహాయాన్ని చెప్పుకుంటారు.”

చేసింది చెప్పుకోవడంలో తప్పులేదంటున్న తమన్న.. అదే టైమ్ లో సహాయం చేసి గుంభనంగా ఉంటున్న సెలబ్రిటీల్ని తప్పుపట్టడం సరికాదంటోంది. తనకు తెలిసిన సెలబ్రిటీలంతా ఈ కరోనా టైమ్ లో సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారని తెలిపింది.

“సెలబ్రిటీలపై ఎప్పుడూ ఈ ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ప్రతిది బయటకు చెప్పాలని అంతా కోరుకుంటారు. కానీ నాలాంటి వాళ్లు కూడా ఉంటారు కదా. చేసింది బయటకు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. నటీనటులందరి దగ్గర కోట్ల కొద్దీ డబ్బు ఉంటుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు.”

ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని ఉంటుందని, ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారని.. అంతమాత్రానికే ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదంటోంది తమన్న.