జగన్ మరోసారి జైలుకు వెళ్తే ఏమౌతుంది..?

“జగన్ మరోసారి జైలుకెళ్లడం ఖాయం.” టీడీపీ పదేపదే వేస్తున్న అరిగిపోయిన రికార్డ్ ఇది. జగన్ ఎప్పటికైనా జైలుకెళ్తారని, ఆయన అతి పెద్ద అవినీతిపరుడని, సమయం దొరికినప్పుడల్లా, సందర్భం లేకపోయినా విమర్శలు చేస్తోంది టీడీపీ.  Advertisement…

“జగన్ మరోసారి జైలుకెళ్లడం ఖాయం.” టీడీపీ పదేపదే వేస్తున్న అరిగిపోయిన రికార్డ్ ఇది. జగన్ ఎప్పటికైనా జైలుకెళ్తారని, ఆయన అతి పెద్ద అవినీతిపరుడని, సమయం దొరికినప్పుడల్లా, సందర్భం లేకపోయినా విమర్శలు చేస్తోంది టీడీపీ. 

బాబు మీడియా అయితే మరో అడుగు ముందుకేసి, జగన్ స్థానంలో షర్మిల పగ్గాలు చేపడతారని కూడా అప్పట్లో వార్తల్ని వండివార్చింది. అయితే షర్మిల తెలంగాణపై ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు అలాంటి ఎల్లో రాతలు రాయడం సాధ్యపడటం లేదు. దీంతో జగన్ జైలుకెళ్లడం ఖాయమని, ఆ స్థానంలో ఎవరంటూ.. పాత రికార్డ్ నే మళ్లీ అందుకుంది టీడీపీ, దాని అను'కుల' మీడియా.

నిజంగా జగన్ జైలుకెళ్తే ఏమౌతుంది?

సోనియా గాంధీకి తలొంచకుండా, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ఉండటం వల్లే ఆనాడు జగన్ జైలుపాలయ్యారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. అందుకే అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఇంత జరిగిన తర్వాత కూడా టీడీపీ మళ్లీ అదే పాత పల్లవి అందుకోవడంలో అర్థం లేదు.

జగన్ కు జైలు కొత్త కాదు.. ఆల్రెడీ 16 నెలలు ఉండి వచ్చారు. ఒకసారి జైలుకు వెళ్లి వచ్చినందుకే ప్రజల్లో ఇంత ఆదరణ, విపక్షాల్ని ఎంత దెబ్బకొట్టాలో అంతా కొట్టారు. 

మరోసారి జైలుకెళ్లి వస్తే, ఇక ఏపీలో ప్రతిపక్షం అనేదే ఉండదు. మరో పాతికేళ్లు జగన్ కు తిరుగుండదు. ఆయనపై అమాంతం సింపతీ పెరగడం ఖాయం. ఈ విషయం తెలిసి కూడా జగన్ పై ''జైలు'' కామెంట్స్ చేస్తోంది టీడీపీ.

జగన్ జైలుకెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి..?

అధికారంలో లేనప్పుడు జైలుకి వెళ్తేనే ఆయన పార్టీకి ఏం కాలేదు. కీలకమైన నేతలెవ్వరూ జగన్ ని వీడలేదు. ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశారు. వైరిపక్షాల వలలో పడకుండా, అధికార పార్టీ ఆశలకు లొంగకుండా జగన్ తోనే ఉండిపోయారు. 

అలాంటిది ఇప్పుడు ఏపీలో అధికారం జగన్ ది, అలాంటిలాంటి అధికారం కాదు, 151మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉంది పార్టీ. ఇలాంటి దశలో జగన్ జైలులో ఉన్నా, సీఎం ఛెయిర్ లో ఉన్నా.. పాలన సజావుగానే సాగుతుంది. ఆయన్ని నమ్ముకున్నవారు, ఆయన నమ్మకం ఉంచినవారు ఎవరూ బయటకు వచ్చే ప్రసక్తే లేదు. తిరుగుబాటు అనేది అసాధ్యం.

విమర్శలతో టీడీపీకి వచ్చే ఉపయోగం ఏంటి..?

జగన్ పై కేసులున్నాయి, ఆ కేసుల విచారణ జోరుగా సాగుతోంది, ఆయన జైలుకెళ్లడం ఖాయం అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. మరోవైపు రఘురామకృష్ణంరాజు వంటి వారితో కోర్టులకు లేఖలు రాయిస్తూ, ఏ క్షణానైనా బెయిల్ రద్దయిపోతుందని, ఏదో జరగరానిది జరిగిపోతుందనే భ్రమల్లోకి జనాలని నెడుతోంది.

వాస్తవానికి జగన్ ను విమర్శించడానికి వాళ్ల దగ్గర సరైన సరుకు లేదు. సంక్షేమ పథకాలపై విమర్శలు చేయలేరు. అందుకే అభివృద్ధి లేదంటూ అరుస్తున్నారు. పార్టీలో అసమ్మతిపై విమర్శలు చేయలేరు, అందుకే వలసలు గ్యారెంటీ అంటూ లీకులు వదుల్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి ఉందని విమర్శలు చేయలేరు, అందుకే నిధుల్ని పప్పుబెల్లాల్లా పంచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

జగన్ ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, మరో మూడేళ్లు ఎలా జనాల్లో ఉండాలో అర్థం కాక, జగన్ బెయిలు రద్దవుతుందని, జైలుకెళ్తారని ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ గమనించాల్సిన మరో అంశం ఉంది. 

ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పాలన పరంగా చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు. వ్యక్తిగతంపై జగన్ పై కేసులు కొనసాగుతూ కూడా ఉండొచ్చు. కానీ వాటిని బూచిగా చూపి ప్రభుత్వంపై, జగన్ పై బురదజల్లాలని అనుకుంటే మాత్రం అది భ్రమే అవుతుంది. ఎందుకంటే, వీటిని మించిన ఇమేజీ ప్రజల్లో జగన్ కు ఉంది.