సహజంగా ప్రపంచంలో ఏడు వింతలున్నాయని చెప్పుకుంటాం. ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎనిమిదో వింతను సృష్టించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ నాయుడి గారిని అరెస్ట్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేయడం 8వ వింతగా చెబుతున్నారు. ఎందుకంటే టీడీపీ అంటే కమ్మ వాళ్ల పార్టీగా ఇటీవల మరింత అధికార ముద్ర వేసుకునేలా ఆ పార్టీ అధినేత ప్రవర్తించిన తీరును అందరూ గుర్తు చేస్తున్నారు. విజయవాడలో స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్న రమేశ్ ఆస్పత్రి నిర్లక్ష్యంతో భారీ అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృత్యువాత పడ్డారు.
ఈ ఘటనలో మృతుల గురించి కంటే రమేశ్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేశ్‌ను అరెస్ట్ చేయకూడదనే టీడీపీ గట్టిగా డిమాండ్ చేయడం ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రమేశ్‌ను జైలుపాలు కాకుండా చూడడం ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత అన్నట్టు వ్యవహరించడమే. దీంతో సామాజిక వర్గం తప్ప, సమాజం పట్టదా అంటూ టీడీపీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో విశాఖలో దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన ఘటనలో నూతన్‌నాయుడిని అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి, టీడీపీ దళిత నాయకుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేయడం ఎనిమిదో వింతగా పలువురు అభివ ర్ణిస్తున్నారు. పేరు చివర “నాయుడు” ఉండడం తెలిసి కూడా ఆనందబాబు అలాంటి డిమాండ్ చేయడమా? అని నెటిజన్లు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. నూతన్ నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించడంతో పాటు వైసీపీ సిద్ధాంతకర్త కాబట్టే చర్యలు తీసుకోలేదని ఆనందబాబు అనడం పలువుర్ని విస్మయానికి గురి చేస్తోంది.
ఎందుకంటే నూతన్‌నాయుడు జనసేనాని పవన్‌కల్యాణ్ వీరాభిమాని. తన అభిమాన హీరో కోసం వర్మను టార్గెట్ చేస్తూ పరాన్నజీవి అనే సెటైరిక్ సినిమా కోసం తీశాడు. అంతేకాదు నూతన్‌నాయుడు తమ పార్టీ అభిమాని అని, నాయకుడు మాత్రం కాదని జనసేన అధికార ప్రతినిధి శివశంకర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ ఏం జరిగినా అధికార వైసీపీకి అంటగట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని తమ పార్టీ దళితనేత ఆనందబాబుతో టీడీపీ తప్పుడు ప్రకటనలు చేయించడం గమనార్హం. వైసీపీతో ఎలాంటి సంబంధం లేని నూతన్‌నాయుడిని ఆ పార్టీతో ముడిపెట్టే జిత్తుల మారి “నక్క” తెలివి తేటలు “ఔరా” అనిపించేలా ఉన్నాయి.