2024లో టీడీపీకి 88 అసెంబ్లీ సీట్లు..!

పొరపాటున టీడీపీకి బలం పెరిగిపోయి వచ్చే ఎన్నికల్లో 88 సీట్లు గెలిచేస్తుందనుకుని పొరబడేరు. అలా ఏ సర్వే కూడా ఇప్పటి వరకు చెప్పలేదు, ఇకపై చెప్పదు కూడా. టీడీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే…

పొరపాటున టీడీపీకి బలం పెరిగిపోయి వచ్చే ఎన్నికల్లో 88 సీట్లు గెలిచేస్తుందనుకుని పొరబడేరు. అలా ఏ సర్వే కూడా ఇప్పటి వరకు చెప్పలేదు, ఇకపై చెప్పదు కూడా. టీడీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే స్థానాల సంఖ్య ఇది. 

అవును.. ఏపీలో ఫిఫ్టీ పర్సెంట్ అసెంబ్లీ సీట్లు జనసేన-బీజేపీ కూటమికి టీడీపీ కేటాయించబోతోంది. అదే రేషియోలో ఎంపీ సీట్లు కూడా. ప్రస్తుతానికి ఇది ఊహాగానమే అనుకున్నా వచ్చే ఎన్నికలనాటికి ఇదే నిజమవుతుందని తలపండిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బద్వేల్ ఉప ఎన్నికలను ఉమ్మడిగా దూరం పెట్టి.. ఇప్పటికిప్పుడు జనసేన-టీడీపీ దగ్గరయ్యాయని అర్థమవుతోంది. సార్వత్రిక ఎన్నికలనాటికి కచ్చితంగా బీజేపీ కూడా వీరితో చేతులు కలుపుతుంది, జగన్ ని గద్దె దించడమే వీరి ధ్యేయం. దాని కోసం చంద్రబాబు ఎంత త్యాగానికైనా సిద్ధం. 

తానుండగానే లోకేష్ లైఫ్ ని సెట్ చేసి వెళ్లాలనేది బాబు ఆలోచన. దాని కోసం ఆయన కచ్చితంగా ఫిప్టీ ఫిఫ్టీ సీట్ల సర్దుబాటుకి ఒప్పుకుంటారని, కూటమి గెలిస్తే లోకేష్ ని సీఎం చేయాలనే ప్రతిపాదన పెడతారని అంటున్నారు.

ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

ప్రస్తుతానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా గెలుపు వైసీపీదే. ఓవైపు జగన్ చిన్న చిన్న తప్పులు చేస్తున్నాడని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతున్నప్పటికీ.. ఆ మేరకు చంద్రబాబుకు మైలేజీ పెరగలేదనేది వాస్తవం. 

ప్రతిపక్షంగా టీడీపీ దారుణమైన పనితీరు కనబరిచిందని ఈ రెండేళ్లలోనే అర్థమైంది. సో.. చంద్రబాబు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, ఎన్ని సీట్లు ఇతరులకు త్యాగం చేసినా ఫలితం ఉండదు.

అయినా కూడా తప్పదు..

సోలోగా పోటీ చేస్తే చంద్రబాబుకి ఈసారి 23 కంటే తక్కువ సీట్లు వస్తాయని తెలుసు. ఇటీవల సర్వేలో చంద్రబాబు కూడా కుప్పంలో ఓడిపోతాడని తెలుస్తోంది. ఈ దశలో పవన్ కాస్త కాపు వర్గంలో బలం పుంజుకుంటే, ఆ ఓట్లన్నీ చీలిపోతే ఇక చేసేదేమీ లేదు. అందుకే బాబు 50 శాతానికి పడిపోతారని తెలుస్తోంది. 

బీజేపీ, జనసేన పేరు చెప్పుకుని కనీస స్థాయిలో సీట్లు తెచ్చుకున్నా లోకేష్ కి పార్టీని అప్పగించి బండి నడిపించొచ్చు. ఆ ఉద్దేశంతోనే బాబు తాపత్రయపడుతున్నారు. అయితే జనసేన, టీడీపీ కూటమి ప్రభావం ఏపీలో ఏమాత్రం ఉండదని తెలుస్తోంది. 

కూటమి కట్టినా జనాలు వారిని నమ్మడానికి సిద్ధంగా లేరు. నిజంగానే బాబు బీజేపీ-జనసేనకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అప్పగిస్తే అది మరో చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.