తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీ తీరు అడుగడుగునా డొల్లగానే ఉంటుంది. అధికారం దక్కితే ఇచ్చిన హామీల విషయంలో మోసాన్ని బహిరంగంగా చేస్తుంది టీడీపీ. అధికారం చేతిలో ఉంటే ఆ పార్టీకి మరేం కనడపడదు. అధికారం చేజారిన దక్కిన నుంచి సుమతీ శతకాలను చెబుతంటారు ఆ పార్టీ నేతలు.
తను చేస్తే శృంగారం, వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం అనే నీతిని పక్కగా ఫాలో అయ్యే పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రతి వ్యవహారంలోనూ రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అదే నీతి సూత్రమని టీడీపీ పక్కగా ఫిక్సయ్యింది.
ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ సమావేశం గురించి కూడా టీడీపీ రెండు రకాలుగా వ్యవహరిస్తోంది. గతంలో జగన్ పార్టీ అసెంబ్లీని బహిష్కరిస్తే టీడీపీ చెప్పిన నీతులు అన్నీ ఇన్నీ కావు. అసెంబ్లీని బహిష్కరించిన జగన్ ప్రజల మధ్యకు వెళ్లిపోయారు. సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టారు. అనునిత్యం ప్రజల మధ్యనే గడిపారు.
అయితే హైదరాబాద్ లో సెటిలైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఇప్పుడు అసెంబ్లీని బహిష్కరించారు. ఒక్కరోజు సమావేశాన్నే అయినా.. బహిష్కరించారు. మరి అప్పుడు జగన్ బహిష్కరిస్తే నీతులు వల్లెవేసిన టీడీపీ, ఇప్పుడు ఏ నీతి ప్రకారం అసెంబ్లీని బహిష్కరించినట్టో మరి!
మరింత కామెడీ ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ అఖిల పక్ష సమావేశాన్ని కోరుకుంటోంది. డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీకి వెళ్లరు కానీ.. అఖిల పక్ష సమావేశాన్ని మాత్రం టీడీపీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశంలో చెప్పదలుచుకున్నది అసెంబ్లీలో చెబితే, అది రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అవుతుంది కదా!
అలాగే.. మరో విషయం ఏమిటంటే.. చంద్రదుబాబు నాయుడు అధికారంలో ఉన్న గత ఐదేళ్ల కాలంలో ఎన్నిసార్లు అఖిలపక్ష సమావేశాలను నిర్వహించారో కూడా టీడీపీ చెప్పాలి.
రాష్ట్ర రాజధాని వంటి కీలకమైన అంశాల గురించి నిర్ణయాలు జరిగినప్పుడు కానీ, ఏదైనా చిన్న విషయంలో కానీ అఖిలపక్ష సమావేశాలను నిర్వహించారా చంద్రబాబు నాయుడు? తాము అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని, నిర్వహించాలి అనిపించని.. అఖిలపక్ష సమావేశాలను ఇప్పుడు నిర్వహించాలని మాత్రం టీడీపీ తెగ డిమాండ్ చేస్తూ, తన డొల్ల తనాన్ని తనే చాటుకుంటూ ఉంటుంది!