తెలంగాణలో రాజకీయం రోజురోజుకి వేడేక్కుతోంది. ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను జనగామ పోలీసులు ఆరెస్ట్ చేశారు.
పాదయాత్రలో భాగంగా బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా సంజయ్ దీక్షకు దిగుతుండగా దీక్షకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు బండి సంజయ్ ను ఆరెస్ట్ చేశారు.
బండి సంజయ్ ను పోలీసులు ఆరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా బీజేపీ కార్యకర్తలు పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
తెలంగాణలో ఎలాగైనా అధికారం రావాలని చూస్తున్నా బీజేపీ రోజుకు ఒక రాజకీయ ఎత్తుగడతో టీఆర్ఎస్ కు దీటుగా వెలుతోంది. బండి సంజయ్ ఆరెస్ట్ తెలియగానే కేంద్ర బీజేపీ పెద్దలు ఆరెస్ట్ ను ఖండించారు. బండి సంజయ్ ను అనవసరంగాఅరెస్ట్ లు చేసి అధికార టీఆర్ఎస్ బీజేపీకి తెలంగాణలో ఛాన్స్ ఇస్తోందంటూ కాంగ్రెస్ మండిపడుతోంది.
Veediki nooru ekkuva yedhochina apukoledu