పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదలయ్యారు. నిన్న హనుమకొండ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన తరపు లాయర్లు కరీంనగర్ జైలు అధికారులకు కోర్టు పత్రాలను అందజేయడంతో సంజయ్ విడుదలయ్యారు.
జైలు వద్దకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలి రావడంతో ముందు జాగ్రత్తగా జైలు పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. తెలంగాణలో వరుస పేపర్ లీకుల వెనుక బండి సంజయ్ హస్తం ఉందని భావించిన పోలీసులు మంగళవారం రాత్రి ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
జైలు నుండి బయటికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ, టైన్ పేపర్ లీకేజీలపై సిట్టిగ్ జడ్డితో విచారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పిచ్చోళ్లను ముద్ర వేస్తున్నరని.. హిందీ పేపర్ లీక్ చేసింది మేమైతే తెలుగు పేపర్ లీక్ చేసింది ఎవరని.. కేసీఆర్ కుటుంబంలోనే లీక్ వీరులు.. లిక్కర్ వీరులు ఉన్నారంటూ మండిపడ్డారు.