తాము కూడా అదే తరహా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు వారికి అనుచితంగా అనిపించలేదు. రాజ్యాంగ నైతిక విలువలకు నిలువునా పాతర వేసినప్పుడు వారేమీ దాని గురించి కనీసంగానైనా చింతించలేదు. కానీ ఇప్పుడు తమదాకా వచ్చేసరికి గగ్గోలు పెడుతున్నారు.
రాజ్యాంగాన్ని చంపేస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, విలువలు పాటించడం లేదని రకరకాల కల్లబొల్లి మాటలతో యాగీ చేస్తున్నారు. తెలంగాణలో గులాబీల ఆక్రోశం గమనిస్తే ప్రజలకు జాలి కలుగుతోంది. దానికి తగ్గట్టుగానే రాజ్యాంగ ఉల్లంఘనలు లేనేలేదని కాంగ్రెసు వారు కౌంటర్లు ఇస్తుండడం విశేషం.
భారత రాష్ట్ర సమితి తరఫున గెలిచిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మండలిలో చీఫ్ విప్ పదవిని కట్టబెట్టింది. అయితే తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్సీకి మండలి చీఫ్ విప్ పదవిని ఎలా కట్టబెడతారంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు ఆ రోజు నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు. సహజంగానే ప్రభుత్వం వీరి అభ్యంతరాలను ఖాతరు చేయలేదు. పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వైనం మీద భారాస నాయకులు హైకోర్టులో వేసిన పిటిషన్లకే ఇప్పటి దాకా దిక్కులేదు. అవేమీ ఒక కొలిక్కిరాలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీని చీఫ్ విప్ చేయడంపై గోల చేస్తున్నారు.
ఇక్కడ ప్రజలకు కలుగుతున్న సందేహం ఒక్కటే. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ చీఫ్ విప్ చేసినందుకు ఇంతగా గోల చేస్తున్నవారు.. ఒక్కసారి వెనక్కి వెళ్లి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారిని తమ జట్టులో కలుపుకుని మంత్రులను చేసిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటే బావుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
హరీష్ రావు లాంటి పరిణితి గల నాయకులు కూడా తలాతోకా లేకుండా జరుగుతున్న పరిణామాలపై ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే వారి పరువే పోతుందని కూడా అంటున్నారు. తాము చేసిన ఉల్లంఘనలన్నీ కన్వీనియెంట్ గా మర్చిపోయి.. ఇప్పుడు గోల చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉండదా అని జనం అనుకుంటున్నారు. అసలు చీఫ్ విప్, లేదా పీఏసీ ఛైర్మన్ వంటి పదవులను గులాబీ దళానికి కేటాయించడంలో పూర్తి రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించామని, ఎక్కడా ఉల్లంఘన జరగనేలేదని మంత్రి శ్రీధర్ బాబు వంటి వారు కౌంటర్లు ఇస్తున్నారు.
నిజం చెప్పాలంటే ఫిరాయింపుల విషయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ, కాంగ్రెసు వారి దూకుడును ఏమాత్రం నిలువరించలేకపోతున్నది. ముగ్గురు ఎమ్మెల్యేల మీద హైకోర్టు పిటిషన్ లే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఒకవైపు పోయేవారు పోతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా తమకు వలస వస్తున్న నాయకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో ప్రస్తుతానికి చేరికలను ఆపినట్టుగా చెబుతున్నది. మరొకవైపు ఎమ్మెల్సీలు కూడా నెమ్మదిగా జారుకుంటున్నారు. ఇన్ని కష్టాల మధ్య తమ పార్టీ బలం పూర్తిగా పలచబడి పోతుండగా- గులాబీ అధినేత నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
Call boy jobs available 9989793850
vc available 9380537747
ముక్కోడు మంచిగా ఫార్మ్ హౌస్ లో బిర్యానీ తిని, జీడిపప్పు , మద్యం సేవిస్తూ రెండు ఊరకుక్కల్ని హరీష్ రావు , డ్రామా రావు ని మంది మీదకి వొదిలాడు వాళ్ళు ప్రజలని చికెన్ ముక్కలు తిన్నట్టు తినేస్తున్నారు