లిక్కర్ పాలసీ.. ప్రశాంతతకు సమాధి

చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పాలసీలో దుకాణాలను ప్రెవేటు పరం చేయడం అనేది పెద్ద కుట్ర.

ఒక ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తున్నదంటే.. దాని లక్ష్యం మరింత మెరుగైన వ్యవస్థకు రూపకల్పన జరగాలి. సమాజానికి మరింతగా మేలు జరగాలి. ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం రావాలి. కేవలం ఆదాయాలు డబ్బుల కొలతలలో మాత్రమే చూడలేం. అందుకే వీటన్నింటినీ మించి.. సమాజం ప్రశాంతంగా కూడా ఉండాలి. అందుకు కొత్త విధానం ఉపయోగపడాలి. ఇవేమీ లేకుండా సాధించకుండా ఒక ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తే ప్రభుత్వం భ్రష్టుపట్టిపోవడం తప్ప మరేం జరగదు.

ఇప్పుడు చంద్రబాబునాయుడు తీసుకువస్తున్న కొత్త లిక్కర్ పాలసీ పట్ల ప్రజల్లో, ఆలోచన పరుల్లో అలాంటి భయాలే వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను ప్రెవేటు పరం చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మద్యం సిండికేట్ల రూపేణా జరిగే దోపిడీ, అవాంఛనీయ పోకడలు మళ్లీ రాజ్యమేలుతాయి. ఇది పైకి కనిపిస్తున్న దుష్పరిణామం మాత్రమే. కనిపించని వ్యవహారాలు, సమాజ ప్రశాంతతకు సమాధి కట్టే పర్యవసానాలు ఇందులో చాలా ఉన్నాయి. వాటన్నింటి గురించిన భయవిహ్వలమైన విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘చంద్రబాబు మార్క్ కొత్త లిక్కర్ పాలసీ సమాజానికి చేటు- ప్రశాంతతకు సమాధి’!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉన్న సలహాదారుల వ్యవస్థ కూడా నాసిరకం ఐడియాలనే తయారుచేస్తున్నారో లేదా, జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ తప్పు పట్టడం ద్వారా మాత్రమే తమ పార్టీకి, ప్రభుత్వానికి మనుగడ ఉంటుందనే దురభిప్రాయం నుంచి చంద్రబాబు బయటకు రాలేకపోతున్నారో తెలియదు. కానీ, ప్రభుత్వం అమలులో పెడుతున్న కొత్త లిక్కర్ విధానం అనేది ప్రభుత్వానికే చేటు చేయనుంది.

సమాజంలో శాంతి భద్రతలకు, ప్రశాంతతకు సమాధి కట్టనుంది. అనేక అవాంఛనీయ పరిణామాలకు దారితీయనుంది. ఎంతో అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబునాయుడుకు ఇలాంటివన్నీ తెలియదని, ఆయన పర్యవసానాలను ఊహించలేనంత అమాయకుడని అనుకోవడానికి వీల్లేదు. కానీ, సమాజంలో అశాంతి ప్రబలి ఉండడమే, ప్రజలందరూ ఒక రకమైన అభద్రతలో ఉండడమే మంచిదని కోరుకోవడం ఒక కేటగిరీకి చెందిన పాలకుల నైజం. అలాంటి సమయాల్లో మాత్రమే.. తమ ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు దృష్టి సారించకుండా ఉంటారని వారు భావిస్తూ ఉంటారు. చంద్రబాబు నైజం కూడా అలాంటిదే కావొచ్చు.

ప్రజలు లేదా సమాజం ప్రశాంతంగా ఉండడం వారికి ఇష్టం ఉండదు. అలాంటి దూరాలోచనతోనే ఆయన ఈ సరికొత్త మద్యం విధానం తీసుకువస్తున్నట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే కొత్త మద్యం విధానం తీసుకువస్తే.. అది పూర్తిగా తప్పు అన్నట్టుగా చంద్రబాబునాయుడు తిరిగి పాతపద్ధతిలోకి మద్యం పాలసీని తీసుకువెళుతున్నారు. దుకాణాలను ప్రెవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టబోతున్నారు. ఈ విధానం సమాజం మీద ఎన్ని రకాలుగా దుష్ప్రభావం చూపించబోతున్నదో గమనించాలి.

జగన్: రెండు తప్పులు- ఒక ఒప్పు

జగన్మోహన్ రెడ్డి తాను తీసుకువచ్చిన మద్యం విధానంలో చేసిన రెండు తప్పులు.. ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంచకపోవడం, ధరలు పెంచి నాసిరకం లిక్కరు ఇవ్వడం అలాగే, డిజిటల్ లావాదేవీలు లేకుండా చేయడం. ఈ రెండు కారణాల వల్ల ఆయన ప్రభుత్వ పాలసీ భ్రష్టుపట్టిపోయింది.

ఒకే ఒక ఒప్పు.. దుకాణాల్ని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించడం. దానివల్ల ప్రతి రూపాయీ ప్రభుత్వ ఖజానాకే వచ్చి చేరింది. కానీ.. ఈ మంచి పని ద్వారా ఖజానాకు జగన్ చేసిన మేలును.. ఆయన చేసిన రెండు తప్పులూ ముంచేశాయి.. మసకబారేలాచేశాయి.

చంద్రబాబు: రెండు ఒప్పులు- ఒక మహా తప్పు

చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పాలసీలో దుకాణాలను ప్రెవేటు పరం చేయడం అనేది పెద్ద కుట్ర. ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడిచే, ఎమ్మెల్యేలకు ప్రతినెలా వాటాలు సమర్పించుకునే వారికి మాత్రమే మద్యం షాపులు దక్కబోతున్నాయనేది జగమెరిగిన సత్యం. ఎమ్మెల్యేలను అతిక్రమించి.. వైసీపీ ప్రభావిత నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా దరఖాస్తులు వేసే పరిస్థితి లేదన్నది కూడా స్పష్టం.

అయితే చంద్రబాబునాయుడు, జగన్ చేసిన దానికి పూర్తి విరుద్ధంగా చేయాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన చేసిన రెండు తప్పులను సరిచేశారు. కానీ ఆయన చేసిన మంచి పనిని తప్పుగా చేస్తున్నారు. అది మామూలు తప్పు కాదు.. మహాతప్పుగా రూపాంతరం చెందబోతోంది.

చంద్రబాబునాయుడు దిద్దిన జగన్ తప్పులు ఏంటంటే.. అన్ని బ్రాండ్ల లిక్కర్ ను అందుబాటులో ఉంచడం మరియు డిజిటల్ లావాదేవీలకు కూడా అవకాశం కల్పించడం. ఎప్పుడైనా సరే డిజిటల్ లావాదేవీలు అనేవి అంతా పారదర్శకంగా జరుగుతున్నదనే భ్రమను కల్పిస్తాయి. ఈ ముసుగులో ఎన్ని రకాల దందాలుంటాయో అదంతా వేరే సంగతి. కానీ, పైకి అంతా చక్కగా కనిపిస్తుంది. అలాగే అన్ని బ్రాండ్లు అందుబాటులో పెట్టడం అనేది ఆయనకు పెద్ద ఎడ్వాంటేజీ అయింది.

ఇంకా సూటిగా చెప్పాలంటే..‘చవకధరలకే నాణ్యమైన మద్యం అందిస్తాం’ అని చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటిస్తే.. జనం నవ్వుకున్నారు. నాయకుడు ఇలాంటి చవకబారు హామీలు ఇస్తారా? అనుకున్నారు. కానీ వాస్తవంలో ఆ హామీ పనిచేసింది. చంద్రబాబుకు రిజల్ట్ తెచ్చిపెట్టింది. మద్యం ప్రియులు ఓట్లు వేశారు. ఆయన చెప్పినట్టే అన్ని బ్రాండ్లు తేవడంతో పాటు, ధర కూడా కొన్నింటిపై తగ్గించారు.

ఇక పోతే ఆయన చేస్తున్న తప్పు సంగతి. జగన్ హయాంలో ప్రభుత్వమే దుకాణాలను నిర్వహించడం వలన.. మద్యం వ్యాపారం ద్వారా రాగల ప్రతి రూపాయీ ప్రభుత్వ ఖజానాకే చేరేది. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. కేవలం ఫీజులు, పన్నులు తప్ప.. ప్రభుత్వ ఖజానాకు వచ్చేదేం లేదు. ప్రభుత్వానికి ఉండగల ప్రధాన ఆదాయ వనరును చంద్రబాబు నాశనం చేసేశారు. ఆయన మరేదో ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనిచేసి ఉంటే వేరే సంగతి. కానీ.. కేవలం తన పార్టీ వారికి దోచిపెట్టడానికి, తన పార్టీ ఎమ్మెల్యేలు దందాలు సాగించుకోవడానికి మాత్రమే ఆయన ఈ విధానం తీసుకువచ్చారు. ఇది శోచనీయం.

అన్ని బ్రాండ్ల లిక్కర్ దొరకకుండా చేశారనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటించిన లిక్కర్ విధానంపై ఉన్న ప్రధానమైన నింద. డిజిటల్ లావాదేవీలకు అవకాశం ఇవ్వకపోవడం అనేది.. పారదర్శక వ్యాపారానికి మచ్చ. దానివలన కూడా జగన్ ప్రభుత్వం నిందలు మోసింది. కానీ.. మద్యం విక్రయాల ద్వారా మంచి ఆదాయం వచ్చింది.

తప్పులను దిద్దకపోవడం ఆత్మహత్యా సదృశం

నిన్న జగన్ కైనా, ఇవాళ చంద్రబాబు అయినా.. తామున చేస్తున్న తప్పును దిద్దుకోకపోతే అది ఆత్మహత్యా సదృశం అవుతుంది. నిన్నటి తప్పులను అంగీకరించకపోవడం ద్వారా.. జగన్ ఎలాంటి స్థితిలో ఉన్నారో చంద్రబాబు చూస్తూనే ఉన్నారు. తాను చేసే మహా తప్పు వల్ల అదే పరిస్థితిని ఆయన కోరుకుంటున్నట్టు అవుతుంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు లేకపోవడం అనేది అవాంఛనీయమైన పోటీకి దారితీస్తుంది. మద్యం వ్యాపారంలో ఆదాయం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో దీని మీద కన్నేసే వారు అనేకమంది ఉంటారు. దుకాణాలు దక్కనివారిలో విపరీతమైన ద్వేషం క్రోధం ఉంటాయి. వారు చేసే అకృత్యాలు అన్నీ ఇన్నీ అని చెప్పడం కష్టం. కొన్ని ఉదాహరణలు మాత్రం మాట్లాడుకుందాం.

ఇప్పటిదాకా జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే షాపుల్లో అమ్ముతున్నందువల్ల గ్రామాల్లో బెల్టుషాపుల వ్యవహారం అనేది లేనేలేదు. ఇప్పుడు ప్రెవేటు దుకాణాల జమానా మొదలు కావడంతో మళ్లీ బెల్టు షాపులు అనే దుర్మార్గమైన వ్యవస్థ తిరిగి ప్రారంభం అవుతుంది. బెల్టు షాపులు నడిపేవారు.. ఏదో ఒక దుకాణం నుంచి తెచ్చి అమ్ముతాడు. అది కాకుండా మరో లిక్కర్ షాపునకు చెందిన వ్యాపారి.. ఆ బెల్టు షాపులను మూసేయించడానికి ఎక్సయిజు వారిని పురిగొల్పడమూ, దాడులు చేయించడమూ వంటివి చేస్తారు. ఇదంతా సమాజంలో శాంతి భద్రతలకు చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది.

ప్రభుత్వం చేతిలో దుకాణాలు ఉన్నంత వరకు ఈ వ్యాపారాల మధ్య అవాంఛనీయమైన పోటీ ఉండదు గాక ఉండదు. కానీ, ప్రెవేటు వ్యాపారాల పరిస్థితి వేరు. ఒకరి వ్యాపారాన్ని కూలదోయడానికి మరొకరు గోతులు తవ్వుతూ ఉంటారు. ఈ పర్యవసానాలు రెండు ముఠాల మధ్య కొట్లాటలుగా, కక్షలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. కక్షలు కార్పణ్యాలు పెరుగుతాయి. పగలు బుసకొడతాయి. చంద్రబాబునాయుడు ‘మంచితనపు పాలసీ’ ముసుగులో ఒకరి మీద మరొకరు కత్తులు దూసుకోవడం జరుగుతుంటుంది. ఇలా ప్రెవేటు దుకాణాలు నడిచినంత కాలమూ రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది.

చంద్రబాబు అసమర్థత బయటపడిందిలా?

చంద్రబాబునాయుడు తాను నలభై నాలుగేళ్ల సీనియారిటీ ఉన్న మహా గొప్ప నాయకుడిని అని పదేపదే చెప్పుకోవాల్సిందే గానీ.. పార్టీ మీద, సొంత పార్టీ నాయకుల మీద, సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద ఆయన ప్రభావం శూన్యం అని లిక్కర్ దరఖాస్తుల సమయంలో స్పష్టంగా అర్థమైపోయింది.

దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు.. చంద్రబాబునాయుడు చాలా ఆదర్శాలను వల్లించారు. పార్టీ వారు గానీ.. ఎమ్మెల్యేలుగానీ.. ఎవ్వరూ ఈ లిక్కర్ దరఖాస్తుల్లో జోక్యం చేసుకోవద్దని అన్నారు. కలెక్టర్లతో మాట్లాడుతూ.. లిక్కర్ వ్యాపారులు సిండికేట్ లు కాకుండా చూడాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ఎవరు లిక్కర్ దరఖాస్తుల్లో జోక్యం చేసుకున్నప్పటికీ.. కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ వారిని హెచ్చరించారు కూడా.

కానీ క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? ఎమ్మెల్యేల్లో చంద్రబాబునాయుడు మాటను పట్టించుకున్న దిక్కులేదు. ఎడాపెడా ఎమ్మెల్యేలు దందాలు నడిపించారు. బెదిరించారు, ప్రలోభపెట్టారు. మొత్తానికి తాము దయపెట్టిన వారు తప్ప మరెవ్వరూ దరఖాస్తు వేయకుండా కట్టడి చేయగలిగారు. ఈ పరిణామం నుంచి అనేక విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు అసమర్థ నిర్ణయం వలన.. ప్రభుత్వానికి రాగల ఆదాయం (కనీసం నాన్ రీఫండబుల్ రుసుముల రూపంలో) గణనీయంగా తగ్గిపోయింది. మరో అంశం ఏంటంటే.. చంద్రబాబునాయుడు మాట పట్ల పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరికీ కనీసంగా కూడా భయం లేదు. మన ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే చంద్రబాబు ఏం చేస్తార్లే అనే తెగింపు వారందరిలోనూ వచ్చేసింది. చంద్రబాబునాయుడు వారిని నియంత్రించలేని దుర్బల స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.

ఈ అంచనాలు అన్నీ తప్పు అనుకుంటే.. ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు అని చంద్రబాబు మాటవరసకు మాత్రమే అన్నారని… వారికి విడిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అనుకోవచ్చు. కానీ అదే నిజమైతే గనుక.. చంద్రబాబునాయుడు ఈ లిక్కర్ పాలసీ రూపంలో పైకి ఒక మాట లోన ఒక మాటగా వ్యవహరిస్తూ తెలుగు ప్రజల్ని దారుణంగా మోసం చేసినట్టు లెక్క. ఆ నేపథ్యంలో ఎటొచ్చీ చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నట్టుగానే పరిగణించాలి.

బాబుగారూ ఈగోకు వెళ్లొద్దు..

జగన్ చేసిన ప్రతి పనీ కూడా తప్పే అని చాటి చెప్పడానికి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఈ లిక్కర్ పాలసీని ఈ రూపంలో తీసుకుని వచ్చి ఉండవచ్చు గాక.. కానీ కనీసం ఏడాది తర్వాత అయినా పాలసీని మార్చుకోవడం మంచిది. రాష్ట్రానికి మేలు జరగాలనే కోరిక ఉన్నట్లయితే ఆయన ఈగోకు పోకుండా నిర్ణయం తీసుకోవాలి. ఒక ఏడాదిలో ఈ విధానం వల్ల ఎన్నెన్ని కనిపించని సమస్యలు ఉత్పన్నం అవుతాయో తేటతెల్లం అవుతుంది.

గత ఏడాది జగన్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ దుకాణాల ద్వారా సాధించిన ఆదాయం కంటె, ఈ కొత్త విధానం వల్ల ఒక ఏడాదిలో సాధించిన ఆదాయం ఎక్కువో తక్కువో లెక్క తేలుతుంది. ఆదాయం తక్కువైతే గనుక.. చంద్రబాబు ఈగోకు పోకుండా నిర్ణయం మార్చుకోవడం మంచిది. డిజిటల్ లావాదేవీలు, అన్ని బ్రాండ్ల లిక్కరు అనే రెండు మంచి నిర్ణయాలను కొనసాగిస్తూ.. ప్రెవేటు దుకాణాలు అనే విషయంలో వెనక్కు తగ్గి.. తిరిగి అన్నీ ప్రభుత్వ దుకాణాల ద్వారానే విక్రయాలు జరిగేలా ఆలోచన చేయవచ్చు. ఆయన ఈగో విడిచిపెట్టడం చాలా అవసరం.

ఆ దిశగా అడుగు పడితే తప్ప.. రాష్ట్రంలో మళ్లా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉంటుందని చెప్పలేం. ఈ విషయంలో చంద్రబాబు తన నిర్ణయాలను పునస్సమీక్షించుకోవడానికి, అవసరమైతే ఆ నిర్ణయాలు దిద్దుకోవడానికి అవసరమైన ధైర్యం ఆయనకు దక్కాలని కోరుకుందాం.

ఎల్. విజయలక్ష్మి

59 Replies to “లిక్కర్ పాలసీ.. ప్రశాంతతకు సమాధి”

  1. జగన్ రెడ్డి నడిపిన మద్యం దుకాణాల డబ్బు మొత్తం తాడేపల్లి పాలస్ కి అటునుండి ప్రేత్యేక విమానం లో జగన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ లో నడుపుతున్న మాఫియా కి తరలి పోయాయి

    1. మనము డబుల్ ఇంజన్ సర్కార్ లండన్ నుంచి మళ్ళీ రాబట్టాలి బ్రో లేదంటే మనకి వాల్యూ ఉండదు మన మాటలకి వాల్యూ ఉండదు

      1. డబుల్ ఇంజన్ సర్కార్ నీచుడు జగన్ రెడ్డి , బీజేపీ సారాయి వీర్రాజు కదా , నువ్వు నీలి బ్యాచ్ వోడివి కదా నీకు వేల్యూ ఏముంటుంది

        1. నీలి బ్యాచ్ వాళ్ళు ఇలా నిజాలు ఒప్పుకోకనే 11 కి వచ్చారు నీలా అడ్డదిడ్డంగా మాట్లాడి

          మనము కూడా వద్దామా 11 కి

          1. చేప్పులతో కొట్టి మరియు కొట్టించుకొని బతికే కంటే అదే బెటర్

  2. Even yellow media is shouting on top of the roof about the corruption introduced by this new liquor policy and leaders are openly making statements about commissions to be paid by the owners of the liquor shops. Having liquor syndicates under the supervision of Kootami leaders will affect state liquor revenue atleast by 30 percentage of overall revenue which will be thousands of crores if all 5 years are accounted.

  3. జగన్ మద్యం పాలసీ లో బెల్ట్ షాప్ లు లెవా హవ్వ ఏమి రా గుల ఆంధ్ర గా సందు కి ఒక బెల్ట్ షాప్ జగ్గడు హయం లో ఇంకా ఆ షాప్ లో పామి చేసే వాళ్ళు మేమే దేముళ్ళు లెక్క బ్రాండ్. లు వస్తే చాలు బ్లాక్ లో అమ్మి పర దొబ్బరూ డబ్బుల్య్ ఇచ్చి కూడా ఆ నా కొడుకాలతో మాటలు పడాల్సి వొచింది రా జఫ్ఫా గా

  4. ఏడి చేసిన విమర్శితే ఎట్ల GA?
    విమర్శించాల్సిన వాటినేమో వదిలేస్తావ్!
    1. 3 - రాజధనులు అన్నప్పుడు నువ్వు ఏమి విమర్శించలేదు
    2. రిషి కొండ బోడి గుడ్డు అయినప్పుడు నువ్వు ఏమి విమర్శించలేదు
    ఇలా అయితే నువ్వు నేను మాత్రమే మిగులటం మన పార్టీలో
  5. ఏడవకు రా చింతలరెడ్డీ… నువ్వు సగుద్దపూస లెక్కన మెడలో జగన్ గాడి పాపాలను కనపడకుండా ఏసుకొని తిరుగుతూ ఇలాంటి పతివ్రత కబుర్లు మోయకు రా టింగురంగా

  6. సనాతన ధర్మ పరిరక్షకుడు అని ఊగి పోయిన అతను నుండి కనీసం విజయదశమి శుభాకాంక్షలు సంబంధించి ఒక ట్వీట్ కూడా లేదు.. తెలుగులో లేదు, హిందీ లో లేదు, ఇంగ్లీష్ లో లేదు, తమిళంలో లేదు, కన్నడలో లేదు. ఇతను నిజంగా హిందూ మతం మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయం కోసమే సనాతన ధర్మని ఎత్తుకున్నాడు.

    1. ఓహ్ దాన్ని బట్టి మనం సనాతన ధర్మం శ్రద్ధ లెక్క లేస్తాం

      అసలు వల్ల ట్విట్టర్ అకౌంట్ ల కు వేరే వాలు మేనేజ్ చేస్తారు . ఇక ఈ రోజు పల్లె పండుగ లో సుమారు 4500 కోట్ల విలువైన పనులకు. టెండర్లు పిలిచారు . ఇక గ్రామాలు కొత్త రూపు సంత రించుకొనున్నాయి

  7. బ్రాండెడ్ మందు బంద్ చేసి, తాడేపల్లి లో తయారుచేసిన 10 రూపాయల పిచ్చి మందుని 100 రూపాయలకి తాగించి లక్షల కోట్లలో mla లకి ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం జెగ్గులు అండ్ సజ్జలు కొట్టేసారు.. బూమ్ బూమ్ మ0చం మేట్స్

  8. ప్రభుత్వమే దుకాణాలు తెరిచి మద్యం అమ్మటం..

    ఆ తరువాత… ఆ ఆదాయం చూపిస్తూ అప్పులు తెచ్చుకొవటం…

    బొహిశా తెలుగు నాట జగన్ మాత్రమె చెసి ఉంటాడు!

    .

    ప్రభుత్వం, మద్యం దుకాణాలకి టెందెర్లు పిలవటం సర్వసాదారణమె!

  9. నోటికొచ్చినట్లు రాసేసుకోవడం వల్ల ఉపయోగం లేది . ఇక్కడ ఎంఎల్ఏ లి interfere అయ్యారో చెప్పాలి ఒక అల్లె గేశన్ చేసేటపుడు ప్రూఫ్ ఎంతో కొంత ఉండాలి. మా ఫ్రెండ్ కు షాప్ వచ్చింది ఈ రోజు ఇంత వరకు మా ఎంఎల్ఏ నుండి మాకు ఎలాంటి బేధిరిపులు రాలేదు మేము ఎవడికి రూపాయి కట్ట లేదు

  10. Jagan distributed public money from treasury in the name of welfare schemes but Kootami does not want AP to become another Srilanka and for that they are struggling very hard to come up with innocative schemes to loot revenue and keep treasury empty.

  11. Jagan distributed public money in the name of welfare schemes but Kootami does not want AP to become another Srilanka and for that they are struggling very hard to come up with innovative schemes to directly loot revenue source and tell people that there is nonrevenue for super six.

      1. I do not know about educated but some uneducated jokers have learnt english from YouTube or by reading books and comment here which I have learnt to ignore.

  12. కేసీఆర్ గతంలో ప్రవేశపెట్టిన 50 రూపాయల క్వార్టర్ ను,ధర పెంచి 99/- లకే నాణ్యమైన మద్యం అంటూ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశ పెడుతున్నారు చంద్రబాబు…

    తెలంగాణలో కొన్ని నెలలకే విపరీతమైన నెగిటివిటీ వచ్చి యాభై రూపాయల క్వార్టర్ ను ఆపేసారు…

    కానీ ఇక్కడ మాత్రం దాన్ని అమృతంగా ప్రచారం చేసి ప్రజల ప్రాణాలను బలిపెడతారు,తిమ్మిని బమ్మిని చేయడం ఆంధ్రలో స్పెషల్ విద్య కదా…

    చూస్తూ ఉండండి జరిగేది అదే…

    1. hammayya bane vunnavru … 2.0 emi ayyindi ??

      ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలు తెరిచి అమ్మటం..

      ఆ తరువాత… ఆ ఆదాయం చూపిస్తూ escrow పెట్టి అప్పులు తెచ్చుకొవటం…

      బొహిశా తెలుగు నాట జగన్ మాత్రమె చెసి ఉంటాడు!

      .

      ప్రభుత్వం, మద్యం దుకాణాలకి టెందెర్లు పిలవటం సర్వసాదారణమె!

  13. సరిపోయింది సంబడం, ఉ చ్చ గు ద్ద వాడిని దించి పాతి గుద్దోడిని సంకనెక్కించున్నారు ఆంధ్రులు .అనుభవించండి , ఆవిధంగా ముందుకి

  14. Orey pichi GA, as per WHO organization, change brands regularly and increase prices so that people don’t show interest on liquor, even stopping digital currency is also helps in less alcohol consumption. Edi kuda teliyatam ledu EVM party 420,210 and kattappa laga

  15. అమ్మ విజయలక్షిమి ఈ సోది చదివే ఓపిక లేదులే కానీ

    చిన్న కరెక్షన్ అండ్ బాటమ్ లైన్ మా జగన్ ప్రభుత్వంలో నేలమాళిగ ఖజానాకు మాత్రమే డబ్బులొచ్చేవి

  16. బ్రాండెడ్ మందు బంద్ చేసి, తాడేపల్లి లో తయారుచేసిన 10 రూపాయల పిచ్చి మందుని 100 రూపాయలకి తాగించి లక్షల కోట్లలో mla లకి ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం జెగ్గులు అండ్ సజ్జలు కొట్టేసారు.. బూమ్ బూమ్ మ0చం మేట్స్

  17. మద్య పాన నిషేధం చేయక పోతే ఓట్లు అడగను అన్న జగన్ మాటని చాలా తెలివిగా డాటసావు, మేం మర్చిపోము

Comments are closed.