ఆయ‌న ఎంత చెబితే.. లోకేశ్ అంత!

కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రి నారా లోకేశ్‌దే పెత్త‌నం. ఎవ‌రు ఔన‌న్నా, కాద‌న్నా ఇదే నిజం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి త‌న‌యుడిగా, టీడీపీ భ‌విష్య‌త్ సార‌ధిగా లోకేశ్ ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ పూర్తిస్థాయిలో అధికారాన్ని చెలాయిస్తున్నారు. అయితే లోకేశ్…

కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రి నారా లోకేశ్‌దే పెత్త‌నం. ఎవ‌రు ఔన‌న్నా, కాద‌న్నా ఇదే నిజం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి త‌న‌యుడిగా, టీడీపీ భ‌విష్య‌త్ సార‌ధిగా లోకేశ్ ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ పూర్తిస్థాయిలో అధికారాన్ని చెలాయిస్తున్నారు. అయితే లోకేశ్ మాత్రం ఆయ‌న చెప్పిన‌ట్టే వింటున్నార‌ని టీడీపీ అనుకూల ప‌త్రిక “ఆంధ్ర‌జ్యోతి” సంచ‌ల‌న క‌థ‌నం రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. లోకేశ్ కోట‌రీలో అంతా తానై న‌డిపిస్తున్న స‌ద‌రు వ్య‌క్తి తీరుపై సీనియ‌ర్ నాయ‌కులు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని రాయ‌డం గ‌మ‌నార్హం.

లోకేశ్‌తో ఎలాంటి ప‌ని కావాల‌న్నా అత‌న్ని క‌లిస్తే స‌రిపోతుంద‌ని ఆంధ్ర‌జ్యోతి ఒక మార్గాన్ని చూపింది. టీడీపీ అనుకూల ప‌త్రిక రాసిన ప్ర‌కారం …ఆ వ్య‌క్తే సానా స‌తీష్‌. ఈయన అధికారి కాదు. ప్రజాప్రతినిధీ కాదు! గత చరిత్రలో పేజీలన్నీ పేచీలు, కేసులే! ఇప్పుడు ఈయనే రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నాడు. త‌న‌కు చెబితే లోకేశ్‌కు చెప్పిన‌ట్టే అని సానా స‌తీష్ ప్ర‌చారం చేసుకుంటున్న‌ట్టు …ఆయ‌న పేరు రాయ‌కుండా ఆంధ్ర‌జ్యోతి సంచ‌ల‌న క‌థ‌నాన్ని వెలువ‌రించింది.

ఇంత‌కూ ఎవ‌రీ స‌తీష్‌? ఏమా క‌థ‌?… తెలుసుకుందాం. సానా స‌తీష్‌ది తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ. 26 ఏళ్ల క్రితం సానా స‌తీష్ చిరు ఉద్యోగి. తండ్రి చ‌నిపోవ‌డంతో కారుణ్య నియామ‌కం కింద విద్యుత్‌శాఖ‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ద‌క్కింది. అయితే ఉద్యోగం చేస్తే, మూడు పూట‌లా తిన‌డానికి త‌ప్ప‌, సంపాద‌న లేద‌ని గ్ర‌హించాడాయ‌న‌. దీంతో కొంత కాలానికే ఉద్యోగాన్ని విడిచి పెట్టాడు.

ఒక‌ప్పుడు టీడీపీలో ఉంటూ చంద్ర‌బాబుకు బినామీగా పిలుచుకునే ఎంపీకి స‌న్నిహితుడిగా మెలిగాడు. ఇప్పుడా ఎంపీ బీజేపీలో కొన‌సాగుతున్నారు. వ్యాపార నిమిత్తం సానా స‌తీష్ హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చాడు. క్రికెట‌ర్ చాముండేశ్వ‌రీనాథ్ త‌దిత‌ర ప్ర‌ముఖుల‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యాల‌తో ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేష‌న్ మ్యూజియం క‌మిటీ స‌భ్యుడయ్యాడు.

ప‌దుల సంఖ్య‌లో కంపెనీల‌కు డైరెక్ట‌ర్ స్థాయికి ఎదిగాడు. ఒక కేసు విష‌యంలో సీబీఐ ఉన్న‌తాధికారి రాకేశ్ అస్తానా మ‌ధ్య‌వ‌ర్తి ద్వారా రూ.5 కోట్లు లంచం అడిగిన‌ట్టు సానా స‌తీష్ 2018లో చేసిన ఆరోప‌ణ జాతీయ స్థాయిలో ఓ కుదుపు కుదిపాయి. సానా స‌తీష్‌పై అనేక కేసులు. పొలిటిక‌ల్ లాబీయిస్ట్ నుంచి ప్ర‌జాప్ర‌తినిధిగా కొత్త అవ‌తారం ఎత్తాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. అయిన‌ప్ప‌టికీ కుద‌ర్లేదు.

దీంతో త‌న పాత ప‌రిచ‌యాల్ని ఉప‌యోగించుకుని లోకేశ్‌కు స‌న్నిహిత‌మయ్యార‌ని, తాను చెప్పిన‌ట్టు మంత్రి వింటార‌ని ప్ర‌చారం చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌లో క‌థ‌నం రావ‌డం విశేషం. తాజా ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నంలో సానా స‌తీష్ గురించి ఏం రాశారో తెలుసుకుందాం.

‘కూటమి సర్కారులో ‘నేనే సూపర్‌ పవర్‌’ అని చెప్పుకొంటున్న ఆ వ్యక్తి తొలుత మైనింగ్‌ వ్యవహారాల్లో అడుగు పెట్టాడు. ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో మైనింగ్‌ వ్యవహారాలను గుప్పిట పట్టాడు. మైనింగ్‌, అటవీ, రెవెన్యూ అధికారుల (డిప్యూటీ కలెక్టర్‌) బదిలీల్లో ఆయన చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. తనకు కీలకమైన ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం పరిధిలో ఆయా శాఖల్లో తనకు నమ్మకస్తులైన వారిని కీలక స్థానాల్లో కూర్చోబెట్టినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాకినాడలో మైనింగ్‌, అటవీ అధికారులకు ఈయన సిఫారసు మేరకే పోస్టింగ్‌ ఇచ్చారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో బాగా విలువైన లేటరైట్‌ నిల్వలున్నాయి’

ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నంతో సానా స‌తీష్ గురించి రాశార‌ని ఎంత మందికి తెలుసో గానీ, మంత్రి లోకేశ్‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే ఆయ‌న గారిని క‌ల‌వాల‌ని లాబీయిస్టులు త‌ప్ప‌క అనుకుంటారు. లోకేశ్ అండ‌దండ‌లు లేనిదే, సానా స‌తీష్ మైనింగ్‌శాఖ‌ను గుప్పిట పెట్టుకునే ప‌రిస్థితి వుందా? ఈ క‌థ‌నంలో రాసిన‌ట్టు మైనింగ్‌, అట‌వీ, రెవెన్యూ అధికారుల బ‌దిలీల్లో చ‌క్రం తిప్పే సీన్ వుందా? అలాంట‌ప్పుడు లోకేశ్‌ను లోకం ఏమ‌నుకోవాలి? లోకేశ్‌తో ఏదైనా ప‌ని కావాలంటే, డ‌బ్బు ఇస్తే సరిపోతుంద‌ని అనుకోరా? తాజా కథ‌నం పుణ్య‌మా అని లోకేశ్‌పై మ‌రింత నెగెటివ్ పెరిగే ప్ర‌మాదం లేక‌పోలేదు.

ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నంలో రాసిన‌ట్టు… సాన పట్టిన కత్తిలా, పాదరసంలా స‌తీష్ దూసుకెళ్లే సంగ‌తి ప‌క్క‌న పెడితే, సాన ప‌ట్టిన కథ‌నం పుణ్య‌మా అని లోకేశ్‌ను అనేక ర‌కాలుగా జ‌నం ఊహించుకుంటారు. లోకేశ్‌పై నెగెటివ్ ప్ర‌చారం పాద‌ర‌సంలో దూసుకుపోతుంద‌ని మాత్రం ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రు.

5 Replies to “ఆయ‌న ఎంత చెబితే.. లోకేశ్ అంత!”

  1. ఇలాంటి అల్లం పులుపు లేని సున్నం కథలు చెప్పుకొని నీ ఆత్మను సంతోషపెట్టుకోరా గొర్రాంద్ర గా…. లోకేష్ జగన్ లాగ అజ్ఞాని కాదు… తెలుగు చదవడం రాయడం లో వెనకవుండొచ్చు కానీ లోకాజ్ఞానం లేకుండా ఎవడో సుల్లి గాడి మీద బతికే పరాన్న జీవి కాదు… వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని గోడలకింద పచ్చిన సాని మాటలు చెప్పుకొనే లేకి పనులు మానేసి, నీ తాన ఎమన్నా authenticated ప్రూఫ్స్ ఉంటే రాయి మాట్లాడు… లేకపోతే నవరాంధ్రాలు మూసుకొని కూర్చో రా నిబ్బా…

Comments are closed.