ఏపీలో మద్యం దుకాణాలకోసం దరఖాస్తు చేసుకున్న వారిలో షాపు భాగ్యం దక్కేదెవరికో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. దరఖాస్తు దారుల నుంచి లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేయబోతున్నారు. అయితే ఈ పర్వంతో పాటుగా.. ఎన్డీయే కూటమి పార్టీ నాయకుల దందా వ్యవహారాలు షురూ అవుతున్నాయి.
నిన్నటి దాకా దరఖాస్తు చేసేవారిని సిండికేట్లు చేయించడంలో బిజీగా గడిపిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎవరికి దుకాణాలు వచ్చినా సరే వారిని బెదిరించి బుజ్జగించి తమకు వాటాలు ఉండేలా, కమిషన్లు దక్కేలా చూసుకోవాలనే పనిలో ఉన్నారు. ఇలాంటి దందాలలో తాడిపత్రి జేసీ ప్రభాకర రెడ్డి ఒక అడుగు ముందుకేసి బహిరంగంగానే తన డిమాండ్లు వినిపిస్తున్నారు.
దరఖాస్తు దారులు బెదిరింపులకు భయపడి సిండికేట్లు కావడం అనేది బాగా జరిగిన నియోజకవర్గాల్లో తాడిపత్రి కూడా ఒకటి. అక్కడ కొన్ని షాపులకు ఒకటి, కొన్నింటికి రెండేసి వంతునే దరఖాస్తులు పడ్డాయి. అయినా సరే.. జేసీ ప్రభాకర్ రెడ్డి తగ్గేదే లేదన్నట్టుగా తన వాటాలు ఎంత ఉండాలో.. లాటరీకి ముందే తేల్చి చెప్పేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో మద్యం షాపు నిర్వహించాలంటే.. ‘జేసీ రూల్ బుక్’ ప్రకారం పాటించాల్సిన విధివిధానాలు ఏమిటో కూడా ఆయన తేల్చిచెబుతున్నారు.
తన నియోజకవర్గంలో లిక్కర్ షాపు ఎవరికి దక్కినా సరే.. 15శాతం వాటా పెట్టుబడి లేకుండానే తనకు ఇవ్వాలని, అదనంగా మరో 20 శాతం వాటాకు పెట్టుబడి పెడతానని, ఆ వాటా కూడా ఇవ్వాలని జేసీ తేల్చి చెబుతున్నారు. బయటి ప్రాంతాల వారిని తమ నియోజకవర్గంలో మద్యం షాపు నడపనివ్వమని హెచ్చరిస్తున్నారు. తాను చెప్పినట్టుగా మొత్తం 35 శాతం వాటా తనకు ఇవ్వకుండా ఊరుకునేది లేదంటున్నారు. ఇదంతా దొంగచాటుగా కాదు, బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.
సూటిగా చెప్పాలంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. జేసీ గనుక ఓపెన్ గా బయటకు చెప్పారు. మిగిలిన తెదేపా, కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు లోపల్లోపల దరఖాస్తు దారులను ముందు నుంచే హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
లాటరీలో ఎవరికి వచ్చినా సరే.. తాము చెప్పిన వారికి చెప్పినంత పెట్టుబడితో కూడిన వాటాలు ఇవ్వాలని, తమకు (అంటే ఆయా ఎమ్మెల్యేలకు) పెట్టుబడి లేని వాటాగా ప్రతినెలా లాభాల్లో కొంత భాగం ముట్టజెప్పాలని ఇప్పటి నుంచే బెదిరిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
చాలా ప్రాంతాల్లో అసలు దరఖాస్తులు అతి తక్కువగా రావడానికి కారణం కూడా ఈ ఎమ్మెల్యేల బెదిరింపులే అని పలువురు చెబుతున్నారు. మరి అంతా పారదర్శకత అని, సిండికేట్లు లేకుండా చూస్తాం అని సుద్దులు చెప్పిన చంద్రబాబు గారు.. జేసీ విడుదల చేసిన ‘వాటాలు- బెదిరింపులు’ వీడియోను చూశారో లేదో! చూసి ఏం చేయబోతున్నారో వేచిచూడాలి.
బ్రాండెడ్ మందు బంద్ చేసి, తాడేపల్లి లో తయారుచేసిన 10 రూపాయల పిచ్చి మందుని 100 రూపాయలకి తాగించి లక్షల కోట్లలో mla లకి ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం జెగ్గులు అండ్ సజ్జలు కొట్టేసారు.. బూమ్ బూమ్ మ0చం మేట్స్
vc estanu 9380537747
Call boy works 9989793850