“ఆంధ్రప్రదేశ్ దృష్టిలో నా భర్త పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యే. కానీ చంద్రగిరి వరకూ నేనే ఎమ్మెల్యే. ఎందుకంటే నాని కంటే నేనే ఎక్కువగా చంద్రగిరి నియోజకవర్గంలో తిరిగాను. ప్రజల్ని కలుసుకున్నాను. మా ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే బాధ్యత నాపై వుంది” అని మూడు నెలల క్రితం పులివర్తి సుధారెడ్డి ధైర్యంగా ప్రకటించారు.
సీన్ కట్ చేస్తే… చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం సాయంత్రం వెళ్లారు. తమ కుటుంబంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో తమ చెవిరెడ్డన్న, అలాగే ఆయన అనుచరుల సెల్‌ఫోన్ల నుంచి వాట్సప్ గ్రూపుల్లో వ్యతిరేక కథనాలు ప్రచారం జరుగుతోందని తేలిందన్నారు. తన అన్న చెవిరెడ్డిని విడిచి పెడుతున్నామని, కానీ మిగిలిన వాళ్లంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తమపై రాస్తున్న వ్యతిరేక కథనాలకు ఆధారాలు ఏవైనా వుంటే నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు.
పులివర్తి నాని కుటుంబంపై వ్యతిరేక కథనాల్ని వైసీపీ అనుకూల మీడియా రాస్తే, సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్నేళ్లుగా చంద్రబాబు, ఆయన పార్టీని భుజాన మోస్తుందనే ఆరోపణలు ఎదుర్కొనే “ఆంధ్రజ్యోతి”లో ఈ నెల 8న తమ్ముళ్లూ…ఇది తగదు శీర్షికతో బ్యానర్ కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో సకుటుంబ పంజా అనే సబ్ టైటిల్‌తో రాసిన అవినీతి గురించి చదివితే… ఎవరి గురించో సులువుగా అర్థమవుతుంది. ఆ వివరాలకు మరిన్న అవినీతి ఆరోపణలు జోడించి సోషల్ మీడియాలో కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
రాజకీయాల్లో పూలు మాత్రమే చల్లాలని అనుకుంటే కుదిరే పనికాదు. రాళ్లు కూడా పడతాయని గ్రహించాలి. పూలతో సమానంగా రాళ్లను కూడా తీసుకోగలిగే స్థితప్రజ్ఞత వుంటేనే రాజకీయాల్లో కొనసాగాలి. లేదంటే తప్పుకోవాలి. పులివర్తి సుధారెడ్డి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. తమపై దుష్ప్రచారం చేసే వారు క్షమాపణలు చెప్పే వరకు విడిచిపెట్టేది లేదని ఆమె హెచ్చరించడం గమనార్హం.
పులివర్తి నాని కుటుంబం తీవ్ర అవినీతికి పాల్పడిందని రాసింది టీడీపీ అనుకూల మీడియానే. ఈ నెల 8న టీడీపీ అనుకూల పత్రికలో పరోక్షంగా ఏం రాశారో చూద్దాం.
“ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో గొడవలతో రాటుదేలిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబ పాలన సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధి, ఆయన భార్య, కొడుకు దందాలు చేస్తున్నారు. తొలుత ఎమ్మెల్యే భార్య అన్నీ తానై వ్యవహరించారు. అధికారులు, ఉద్యోగులను ‘అరేయ్.. ఒరేయ్’ అని పిలవడం, ఇంటి గేటు బయటే నిలబెట్టి దూషించేవారని ఫిర్యాదులు వచ్చాయి. ఉన్నతాధికారులు, ద్వితీయ తృతీయశ్రేణి అధికారులను విభాగాల వారీగా పిలిచి మీటింగ్‌లు పెట్టారు. ఏ అధికారికి ఎంత జీతం వస్తుంది? పై ఆదాయం ఎంత వస్తుంది? ఇప్పటి దాకా ఎంత సంపాదించారు? ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి? వంటి వివరాలు తెలుసుకున్నారు. ప్రైవేటుగా వచ్చే ఆదాయంలో 50 శాతం ఇవ్వాలని ఒప్పందాలు చేసుకున్నారు. వారిలో రెవెన్యూ, పురపాలక అధికారులే ఎక్కువగా ఉన్నారు”
” గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు ఏ పనికి ఎంత ముట్టజెప్పారో తమకు అంతకు రెట్టింపు ఇవ్వాలని, లేదంటే జిల్లా దాటిస్తామని హెచ్చరికలు చేశారు. రెవెన్యూ అధికారులకు నెలవారీ టార్గెట్‌లు పెట్టారు. ఆర్డీఓ, తహసీల్దార్, డీటీ, మండల సర్వేయర్, ఆర్‌ఐ, వీఆర్‌ఓలు నెలవారీ టార్గెట్‌లు పూర్తిచేయాలి. లేదంటే ఎమ్మెల్యే ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. బదిలీకి సిఫారసు లేఖను వాట్సప్‌లో పంపిస్తారు. ఇప్పుడు బదిలీల ప్రక్రియ సాగుతుండటంతో రెవెన్యూ ఉద్యోగులకు రేట్లు ఫిక్స్ చేశారు. ప్రతి వీఆర్‌ఓ 5 లక్షలు, ఆర్‌ఐ 10 లక్షలు సమర్పించుకున్నారు. ప్రస్తుతం ఆయా పోస్టుల్లో ఉన్నవారే కొనసాగాలంటే ఈ ధర. కొత్తవారు రావాలంటే అంతకు రెట్టింపు సమర్పించుకోవాలి. డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్ పోస్టులకు రూ.25 లక్షలు ఫిక్స్ చేశారు. తహసీల్దార్ పోస్టుకు కనీసం కోటిన్నర. కీలక భూములున్న మండలాన్ని బట్టి మూడు కోట్ల వరకు సమర్పించుకునేలా షరతు పెట్టారు. తమ దగ్గర అంత డబ్బు లేదన్న అధికారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ముందుగా సగం పేమెంట్ చేయాలి. మిగతాది ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లిస్తానని రాసివ్వాలి. ఇలా ఐదు మండలాల్లోని రెవెన్యూ పోస్టులకు వేలం ప్రక్రియను ముగించేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఏ భూములను కాపాడాలని పోరాటం చేశారో, ఇప్పుడు అవే భూముల్లో జెండాలు పాతారు”
ఈ కథనం రాసిన పత్రికకు యజమాని అయిన వేమూరి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని సుధారెడ్డి డిమాండ్ చేస్తారా? ఈ అవినీతి ఆరోపణలన్నీ తమ కుటుంబం గురించి కాదని సుధారెడ్డికి చెప్పే ధైర్యం వుందా? అధికారంలో ఉన్నామని, పోలీసులు, కేసులు అని భయపడిస్తే, బెదురుతారని సుధారెడ్డి అనుకుంటే తప్పవుతుంది. ఎటూ ఇంటి పేరులో పులి అని వుంది. గుండెల్లో దమ్ము వుందని పులివర్తి నాని, ఆయన భార్య తరచూ చెబుతుంటారు కదా!
తమపై తప్పుడు కథనాన్ని రాసిన ఆర్కే క్షమాపణ చెప్పే వరకూ తగ్గేదేలే అని సుధారెడ్డి హెచ్చరిస్తేనే మజా. అనుకూల మీడియానే తమ కుటుంబంపై అవినీతి ఆరోపణలతో కూడిన కథనాన్ని రాస్తే, ప్రత్యర్థులు ఊరుకుంటారని సుధారెడ్డి ఎలా అనుకుంటున్నారో ఆమెకే తెలియాలి. ముందు సొంత మీడియా నోళ్లను కట్టేసుకోండి. అంటే ఆర్కేను భయపెట్టండి. ఆ తర్వాత మిగిలిన వాళ్లు ఎటూ భయపడి నోర్మూసుకుంటారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్ ఎదుట పులివర్తి నాని ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. నేను గానీ, నా భార్య, కుమారుడు అవినీతి చేస్తే, చంద్రగిరి టవర్‌క్లాక్ వద్ద నన్ను రాళ్లతో కొట్టండి అని నాని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇప్పుడు సొంత మీడియా పులివర్తి అవినీతిపై కోడై కూస్తోంది. మీడియాను నోర్మూయిస్తారా? లేక తాము అవినీతి మానుకుంటారా? ఆర్కేతో క్షమాపణ చెప్పించుకుంటారా.. ఇవీ సుధారెడ్డి ఎదుట ఉన్న టాస్క్. ఏం చేస్తారో చూడాలి. సుధారెడ్డి తీరు చూస్తే మాత్రం… ఆమె తగ్గదనే భావన కలుగుతుంది.
mari intala tinapapote elaa
పది లక్షల కోట్లు అప్పు చేసి కేవలం 3 లక్షల కోట్లు ప్రజలకి పంచిన 11 రెడ్డి కి అదే ప్రజలు ఎన్నికల్లో పంగనామాలు ఎందుకు పెట్టారు??
BTW మిగతా 7 లక్షల కోట్లు ఎక్కడరా లOగా 11??
Gabbu nayala tutu
11 seats yeee party ki radhu okka vellaa vachindi anteee evm tamparing chesaru anni ardham votammi bhayam tho chesaru tdp
vc available 9380537747
Call boy works 9989793850
అంటె Andhrajyothy పూర్తిగా సాక్షి లా ఒక పైపు మాత్రమె రాయాదు అంటావా? సాక్షి ఇలా Y.-.C.-.P గురించి రాసిందా?
తమరు రెచ్చగొట్టడంలో కూడా సూపరే గ్రేట్ రెడ్డి
Patcha batch mla lu penta thinade
అరే బులగు గొఱ్ఱె!.. అవినీతి జరిగిందని ఖరాఖండిగా చెప్పకుండా.. అందరినీ క్షమాపణ చెప్పించాలంటున్నావంటే.. అవినీతి జరగలేదనే అర్థం గదరా ..