లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి అరివీర డిజాస్టర్ల తరువాత దర్శకుడు పూరి జగన్నాధ్ కు మళ్లీ మరోసారి అవకాశం అంటే కాస్త కష్టమే. కానీ తప్పదు కదా ప్రయత్నం చేయాల్సిందే. పైగా డబుల్ ఇస్మార్ట్ నష్టాలు అంతో ఇంతో పూడ్చాలి కదా. అదే ప్రయత్నంలో వున్నారు దర్శకుడు పూరి.
లేటెస్ట్ గా ఓ కథను హీరో సిద్దు జొన్నలగడ్డకు చెప్పినట్లు తెలిసింది. నిజానికి పూరి స్టయిల్ అటిట్యూడ్ పాత్రలకు సిద్దు పక్కాగా సరిపోతాడు. అందుకే ఓ కథను ఒకటి రెండు రోజుల క్రితం చెప్పినట్లు తెలుస్తోంది.
కానీ ఇప్పటికే జాక్ అనే సినిమా చేస్తున్నాడు సిద్దు. పూరి చెప్పిన కథ దానికి దగ్గరగా వుందని తెలుస్తోంది. అందుకే అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు బోగట్టా. దాంతో మరో కథ పట్టుకు వస్తా అని పూరి వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే పూరి డబుల్ ఇస్మార్ట్ ను గుడ్డిగా నమ్మి, కోట్లకు కోట్లు పోసి హోల్ సేల్ గా కొన్నారు నిర్మాత నిరంజన్ రెడ్డి. దానికి చాలా భారీగా నష్టపోయారు. దీన్ని మ్యూచువల్ గా సెట్ చేసుకోవాల్సి వుంది. కానీ తన దగ్గర డబ్బులు లేవని, కావాలంటే తన పాత సినిమాల హక్కులు ఇస్తాను రీ రిలీజ్ చేసుకోమని పూరి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ వాటి వల్ల ఏం చిల్లర రాలుతుంది? అందుకే దీనికి నిరంజన్ రెడ్డి ఒప్పుకోలేదని తెలుస్తోంది.
vc available 9380537747
vc estanu 9380537747
Call boy jobs available 9989793850
ఇడ్లి విశ్వనాథ్ మంచి మనిషి కాకపోతే సినిమాకి కథ కాకరకాయ లాంటివి అవసరంలేదు అని గట్టిగా నమ్ముతాడు .. ఏదో మూడ్ వచ్చినప్పుడు ఒక గంటలో కొన్ని సీన్లు రాసుకోవడం … దాంట్లో ఒక పాయింట్ పట్టుకుని షూటింగ్ మొదలెట్టడం మిగతా సీన్లు షూటింగ్ రోజు ఏమి అనిపిస్తే అది తీసేసి సినిమా చుట్టెయ్యడం … ఓవరాల్ గా చేసే పనిమీద … డబ్బులిచ్చే ప్రేక్షకులమీద చులకనభావం .. అందుచేత ఈయన సినిమాలు ఏదో ఫ్లూక్ లో హిట్ కావలసిందే తప్ప … కథ వల్ల హిట్ అయ్యాయి అని చెప్పలేం..
మనిషి మంచోడు కాబట్టి కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు అంతేగానీ చేసే వృత్తిమీద శ్రద్దా గౌరవం లేని ఇతనిమీద డబ్బుపెట్టి వ్యాపారం చెయ్యడం మూర్ఖత్వం
హ హ హ…