ఈ సారి తెలంగాణ ఎన్నికలు చాలా గమ్మత్తుగా సాగుతున్నాయి. సోషల్ మీడియా ప్రచారం వేరు, వాస్తవం వేరు.. నిజానికి ఏ పార్టీ మెరుగ్గా ఉంది.. ఎవరు మాయ చేస్తున్నారు..? అనే ప్రశ్నే వస్తే.. ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనే మెరుగ్గా ఉందని.. కాంగ్రెస్ పార్టీ మాయ చేస్తుందని చెప్పవచ్చు.
తెలంగాణ రాజకీయాల్ని కర్ణాటకతో పోల్చుతు చాలా మంది పప్పులో కాలేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని కొంతమంది కృత్రిమ వేవ్ ని క్రియేట్ చేస్తున్నారు.. అదే పనిగా అందరికి స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా మాత్రమే వ్యాప్తి చెందింది.
తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోతున్నదని కర్ణాటక రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది.. కర్ణాటక పొలిటికల్ డైనమిక్స్ డిఫరెంట్.. తెలంగాణ పొలిటికల్ డైనమిక్స్ డిఫరెంట్. అక్కడ ఒక్కోసారి ఒక్కో పార్టీకి ప్రజలు అవకాశాన్ని ఇస్తుంటారు. ఇక్కడ వేరు.. తెలంగాణలో రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నాం. కాబట్టి, ఇక్కడి సొంత పార్టీ పాలించాలని ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉంది. తెలంగాణ ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు.
మనం ముఖ్యంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కాంగ్రెస్ వస్తే ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను అభివృద్ది చేయకుండా అణచివేసింది. ఇది ప్రత్యక్షంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అయితే కాంగ్రెస్ మాత్రం దీన్ని రివర్స్ గా ప్రచారం చేస్తోంది. 2018లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. కానీ, రాజకీయ విశ్లేషకులు 100% బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు అదే జరిగింది కూడా.
2018లో అధికార పార్టీకి 18% ఎక్కువ అనుకూలత ఉంది. ఇపుడు అంత అనుకూలత లేకపోయినా న్యూట్రల్ బేసిస్ లో ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ షేర్ విషయంలో బిఆర్ఎస్ పార్టీకి 43% సాలిడ్ గా ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఏనాడూ 35% మించి పెరగలేదు. రెండింటికి మధ్య డిఫరెన్స్ 7 నుంచి 8% ఉంది.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే గత ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ కు బలమైన సెగ్మెంట్ గా ఉంది. కేవలం ఒక్క సీట్ తప్ప మిగిలినవన్నీ కాంగ్రెస్ గెలిచింది. కాని ఇప్పుడు ఇల్లందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం, సత్తుపల్లి లో బీఆర్ఎస్ వన్ సైడ్ కనిపిస్తోంది. కొత్తగూడెం సిపిఐకి కేటాయించారు. అక్కడ కూడా బీఆర్ఎస్ ట్రెండ్ కనిపిస్తోంది.
ఇలాంటి ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ కు అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు, కాంగ్రెస్ రాష్ట్రంలో 60 లేదా 70 స్థానాలు వస్తాయి అని చెప్పడానికి ఎక్కడ ఆస్కారం లేదు. సర్వేలు అన్ని కూడా చెబుతున్నది ఇదే. ఇక సోషల్ మీడియా ప్రచారం కృతిమ వేవ్ ని బీఆర్ఎస్ ఓటింగ్ శాతం తగ్గించే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపు ఉన్నారని అన్ని అంశాలను బేరీజు వేస్తే సుస్ఫష్టం.