తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏ మాత్రం తగ్గడం లేదు. గవర్నర్ పరిపాలనా పరమైన అంశాల్లో జోక్యం చేసుకో వద్దని, రాజకీయ కామెంట్స్ చేయవద్దని తమిళిసైకి ఎంతో మంది నేతలు హితవు చెబుతున్న సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌కే ఆమెను కట్టడి చేయాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
కట్టడి చేయాలనే ప్రయత్నాలు పెరిగే కొద్ది, ఆమె మరింత రెచ్చిపోతున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన బాధితులను పరామ ర్శించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కంటే ముందుగానే ఆమె ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తాజాగా ఆమె నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. ఇటీవల అక్కడి విద్యార్థులు తమ సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించారు.
చివరికి ప్రభుత్వం దిగి వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం ఆందోళన విరమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడికి తమిళిసై వెళ్లడం చర్చకు దారి తీసింది. విద్యార్థులతో కలిసి టిఫెన్ చేశారు. అనంతరం విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ తానొక తల్లిగా ఇక్కడికి వచ్చానన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు అధ్యాపకులు లేరని గవర్నర్ అన్నారు. 2017 నుంచి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదన్నారు. అలాగే వసతి గృహంలో మెస్ నిర్వహణ సరిగా లేదన్నారు. విద్యార్థులు తీవ్ర ఆవేదనలో ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.
ఇదిలా వుండగా తమిళిసై సమస్యలంటూ పర్యటించడాన్ని కేసీర్ సర్కార్ జీర్ణించుకోలేకపోతోంది. ఆమెకు ఏం పని? అని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.