మామను తాగుబోతును చేసిన అల్లుడు!

పార్టీ అధికారంలో లేకపోయినా, కేసీఆర్‌కు తాగుబోతు అనే పేరు చెరిగిపోలేదు.

రాజకీయ నాయకులు విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం చాలా సహజం. చట్ట సభల్లో సమస్యలపై చర్చించడం కంటే ఒక పార్టీ వారు మరో పార్టీపై వ్యక్తిగత విమర్శలు చేసుకోవడమే ఎక్కువగా కనిపిస్తోంది. చట్ట సభల్లో విలువలు, ప్రమాణాలు ఏనాడో దిగజారిపోయాయి.

ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా ఇందుకు మినహాయింపు కాదు. తెలంగాణ అసెంబ్లీ కూడా అంతే. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష గులాబీ పార్టీ మధ్య తీవ్రంగా విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

ప్రతిపక్షం వారైనా, అధికార పక్షం వారైనా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే సభలో పరువు పోయే అవకాశం ఉంది. సభ్యులు ఊరుకోరు కదా, మాటకు మాట అంటారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన ఒక వ్యాఖ్య ఆయన మామ కేసీఆర్ పరువు తీసినట్లయింది.

వాస్తవానికి కాంగ్రెస్ వారు కేసీఆర్‌ను ఎప్పుడూ అనేవారు, చేసే విమర్శ అదే. కానీ అసెంబ్లీలో కూడా కేసీఆర్‌ను వదిలిపెట్టలేదు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేయడంలో భాగంగా చేతులకు బేడీలు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడో రేపో నిజంగానే పోలీసులు వచ్చి మిమ్మల్ని బేడీలు వేసి తీసుకెళతారని అన్నాడు.

దీంతో హరీష్ రావుకు కోపం వచ్చింది. సభలోకి ఉదయాన్నే కొందరు తాగి వస్తున్నారని, కాబట్టి ఇక్కడ కూడా బ్రీత్ అనలైజర్లు పెట్టాలని అన్నాడు. దీని ద్వారా హరీష్ రావు అనకుండానే కేసీఆర్‌పై కామెంట్ చేసినట్లయింది. ప్రజలు కేసీఆర్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా కట్టబెడితే, ఆయన అసెంబ్లీకి రాకుండా తాగి ఫామ్‌హౌస్‌లో పడుకుంటున్నాడని వ్యాఖ్యానించారు.

అంటే హరీష్ రావు పనిగట్టుకుని మామను తాగుబోతుగా చేసినట్లే కదా! నిజానికి రాజకీయ నాయకుల్లో చాలామంది తాగుతారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచే ఆయనకు తాగుబోతుగా ముద్ర వేశారు.

ఆయన పార్టీ అధికారంలో లేకపోయినా, కేసీఆర్‌కు తాగుబోతు అనే పేరు చెరిగిపోలేదు. ఆయన్ని రాజకీయ నాయకుడిగా కంటే తాగుబోతుగానే కాంగ్రెస్ నాయకులు పాపులర్ చేశారు. చివరకు అసెంబ్లీలో సైతం ఆయన్ని వదిలిపెట్టలేదు.

5 Replies to “మామను తాగుబోతును చేసిన అల్లుడు!”

  1. నువ్వు ఎలా చెప్తావ్ అయ్యా హరీష్ రావ్ పని కట్టుకుని మామను తాగుబోతును చేసాడు అనే generalised statement..

    ఈ పనికి మాలిన కాంగ్రెస్ జర్నలిజం ఆపి, న్యూట్రల్ గా వార్త రాస్తే బాగుంటది, అంతేగానీ నీ అభిప్రాయాలు రుద్దకు..

Comments are closed.