చెన్న‌మ‌నేనికి హైకోర్టులో రూ.30 ల‌క్ష‌ల జ‌రిమానా

త‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన వేముల‌వాడ మాజీ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్‌కు తెలంగాణ హైకోర్టు భారీ జ‌రిమానా విధించింది.

త‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన వేముల‌వాడ మాజీ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్‌కు తెలంగాణ హైకోర్టు భారీ జ‌రిమానా విధించింది. చెన్న‌మ‌నేనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు రూ.30 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది తెలంగాణ హైకోర్టు. ఇందులో పిటిష‌న‌ర్ ఆది శ్రీ‌నివాస్‌కు రూ.25 ల‌క్ష‌లు, హైకోర్టు లీగ‌ల్ స‌ర్వీస్ అథారిటీకి రూ.5 ల‌క్ష‌లు చెల్లించాల‌ని న్యాయ‌స్థానం సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. అస‌లు కేసు ఏంటో తెలుసుకుందాం.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా రాజ‌కీయాల్లో చెన్న‌మ‌నేని కుటుంబాలు క్రియాశీల‌క పాత్ర పోషిస్తున్నాయి. చెన్న‌మ‌నేని రాజేశ్వ‌ర‌రావు, విద్యాసాగ‌ర్‌రావు అన్న‌ద‌మ్ములు. అయితే రాజేశ్వ‌ర‌రావు వామ‌ప‌క్ష ఉద్య‌మాన్ని ఎంచుకోగా, ఆయ‌న సోద‌రుడు విద్యాసాగ‌ర్‌రావు అందుకు పూర్తి విరుద్ధ‌మైన బీజేపీలో నాయ‌కుడిగా ఎదిగారు. రాజేశ్వ‌ర‌రావు వార‌సుడిగా ర‌మేశ్ 2009లో ప్ర‌త్య‌క్ష‌ రాజ‌కీయాల్లో అడుగు పెట్టారు.

2009లో టీడీపీ త‌ర‌పున వేముల‌వాడ నుంచి ర‌మేశ్ బాబు పోటీ చేసి, త‌న ప్ర‌త్య‌ర్థి , కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆది శ్రీ‌నివాస్‌పై 1,821 ఓట్ల స్వ‌ల్ప తేడాతో గెలుపొందారు. అయితే ర‌మేశ్ ఎన్నిక చెల్ల‌ద‌ని, అఫిడ‌విట్‌లో త‌ప్పుడు స‌మాచారం న‌మోదు చేశార‌ని, అస‌లు మ‌న పౌరుడే కాద‌ని శ్రీ‌నివాస్‌ న్యాయ‌పోరాటం మొద‌లు పెట్టారు. త‌ప్పుడు ద్రుదీక‌ర‌ణ ప‌త్రాల‌తో భార‌తీయ పౌర‌స‌త్వం పొందిన‌ట్టు న్యాయ స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

2010, జూన్‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌పున ర‌మేశ్ పోటీ చేయ‌గా, అవే ఆరోప‌ణ‌ల‌తో ఎన్నిక‌ల సంఘానికి శ్రీ‌నివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎన్నిక‌ను నిలిపివేసింది. అయితే బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, ఆరు నెల‌ల్లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించాలనే నిబంధ‌న‌ను గుర్తు చేసి, ఆ మేర‌కు ఎన్నిక నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాల్ని సుప్రీంకోర్టు త‌ప్పు ప‌ట్ట‌డం అప్ప‌ట్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌హైంది. నాటి నుంచి ర‌మేశ్ పౌర‌స‌త్వంపై శ్రీ‌నివాస్ అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉన్నారు.

2013లో రమేశ్‌బాబు పౌరసత్వాన్ని, శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే సుప్రీం కోర్టును అశ్రయించి స్టే పొందారు. ఒక‌వైపు న్యాయ‌స్థానంలో వివాదం న‌డుస్తుండ‌గా, మ‌రోవైపు 2014 ఎన్నికల్లో రమేశ్‌బాబు గెలుపొంద‌డం గ‌మ‌నార్హం. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల‌తో కేంద్ర హోంశాఖ 2017లో రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది. హైకోర్టును ఆశ్ర‌యించొచ్చ‌ని కేంద్ర‌హోంశాఖ వెస‌లుబాటు ఇవ్వ‌డంతో మళ్లీ వ్య‌వ‌హారం హైకోర్టుకు చేరుకుంది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంత‌కాలం చెన్న‌మ‌నేని రమేశ్ ఏ పాస్‌పోర్ట్‌పై ఉన్నార‌ని హైకోర్టు ప్ర‌శ్నించ‌గా, జ‌ర్మ‌నీ దేశం అని పాస్‌పోర్ట్‌పై ట్రావెల్ చేస్తున్న‌ట్టు ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు. అయితే పాస్ పోర్ట్ ముఖ్యం కాద‌ని చెన్న‌మ‌నేని త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. ఇండియా పాస్‌పోర్ట్ వుందా? అని హైకోర్టు ప్ర‌శ్నించ‌గా, లేద‌నే స‌మాధానం వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో పదిన్నరేళ్ల‌పాటు హైకోర్టులో చెన్నమనేని రమేష్‌ కేసు సుదీర్ఘ విచారణ జరిగింది. హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. చెన్నమనేని రమేశ్‌ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. చెన్నమనేనికి హైకోర్టు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, మరో రూ.5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ జ‌రిమానాను నెల రోజుల్లో చెల్లించాల‌ని హైకోర్టు ఆదేశించింది.

9 Replies to “చెన్న‌మ‌నేనికి హైకోర్టులో రూ.30 ల‌క్ష‌ల జ‌రిమానా”

  1. టీడీపీ హయాం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అనటానికి ఈ కేసు ప్రత్యక్ష నిదర్శనం !! ఈ లెక్కన ja*** గాడు చేసిన ఎన్నో ఎదవ పనులకు ఉ*రి శిక్ష కన్ఫర్మ్ !!

  2. టీ*డీ*పీ హయాం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అనటానికి ఈ కే*సు ప్రత్యక్ష నిదర్శనం !! ఈ లెక్కన ja*** గాడు చేసిన ఎన్నో ఎ*దవ పనులకు ఉ*రి శి*క్ష కన్ఫర్మ్ !!

  3. టీ*డీ*పీ హయాం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అనటానికి ఈ కే*సు ప్రత్యక్ష నిదర్శనం !! ఈ లెక్కన ja*** గాడు చేసిన ఎన్నో ఎ*దవ పనులకు*ఉ*రి శి*క్ష కన్ఫర్మ్ !!

  4. అమెరికా లో ఒక అబ్బాయి giant wheel మీద నుంచి పడిపోయి చచ్చిపోతే అక్కడ కోర్ట్ 2000 కోట్లు జరిమానా విధించింది ఆ giant wheel తయారు చేసిన కంపెనీకి.

Comments are closed.