ఛానెళ్ల కొట్టాటలతో బజార్న పడ్డ జూబ్లీహిల్స్ సొసైటీ!

రెండు న్యూస్ ఛానెళ్ల మధ్య ఉన్న విభేదాలు, రెండు ఛానెళ్ల యజమానుల మధ్య ఉండే వైరం ముదిరి బజార్న పడి.. ఇప్పుడు జూబ్లీహిల్స్ సొసైటీ భ్రష్టు పట్టిపోయే పరిస్థితి ఏర్పడింది. మామూలు రాజకీయాల్లో ఉండే…

రెండు న్యూస్ ఛానెళ్ల మధ్య ఉన్న విభేదాలు, రెండు ఛానెళ్ల యజమానుల మధ్య ఉండే వైరం ముదిరి బజార్న పడి.. ఇప్పుడు జూబ్లీహిల్స్ సొసైటీ భ్రష్టు పట్టిపోయే పరిస్థితి ఏర్పడింది. మామూలు రాజకీయాల్లో ఉండే ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు.. ఒకరి పరువు ఒకరు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఒకరిని భ్రష్టు పట్టించడానికి మరొకరు ప్రయత్నిస్తూ మొత్తంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగానే.. ఇప్పుడు జూబ్లీ హిల్స్ సొసైటీ పరిస్థితి కూడా తయారైంది.

కొత్తగా సొసైటీ యాజమాన్యం చేపట్టిన పాలకవర్గం.. పాత కమిటీ అతి భయంకరమైన అవినీతికి పాల్పడినదంటూ వారి మీద విచారణలు చేయించడం.. జరిమానాలు కట్టాలని నోటీసులు ఇవ్వడం.. దానికి దీటుగా కొత్త పాలకవర్గం చేసిన అక్రమాల గురించి పాత కమిటీ వారు ప్రత్యారోపణలు చేయడం.. వెరసి జూబ్లీ హిల్స్ సొసైటీ గౌరవం భ్రష్టుపట్టిపోతోంది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు పేరు కూడా బద్నాం అవుతున్నది.

ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆ ఛానెల్ పెట్టక ముందునుంచి కూడా జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి అధ్యక్షుడుగా ఉన్నారు. 2005 నుంచి 2021 వరకు ఆయన సారథ్యంలోనే ఈ సొసైటీ ఉండేది. అప్పట్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారనే పేరు కూడా ఆయనకు ఉంది. అందుకే అంత సుదీర్ఘకాలం ఎన్నికల్లో నెగ్గుతూ అధ్యక్షుడిగా ఉండగలిగారు.

ఇటీవలి కాలంలో సొసైటీ ఎన్నికల్లో వేరే ప్యానెల్ గెలిచింది. టీవీ5 అధిపతి బిఆర్ నాయుడు కొడుకు బొల్లినేని రవీంద్రనాధ్ అధ్యక్షుడు అయ్యారు. ఎన్టీవీ, టీవీ5 ఛానెళ్ల మధ్య ఉండే మీడియా పోరాటం చాలా మందికి తెలిసిన సంగతే. దానికి కొనసాగింపు అన్నట్టుగా జూబ్లీ హిల్స్ సొసైటీ రాజకీయాలు తయారయ్యాయి.

రవీంద్రనాధ్ సారథ్యం స్వీకరించాక.. నరేంద్ర చౌదరి కాలంలో జరిగిన నిర్ణయాలు, వ్యవహాలపై విచారణకు ఆదేశించారు. ప్రత్యేకంగా ఒక కమిటీ వేశారు. నరేంద్ర చౌదరి హయాంలో అనేక అక్రమాలు జరిగినట్టుగా వారు నిర్ణయించి అప్పటి కమిటీ వారంతా కలిపి 17 కోట్ల రూపాయలకు పైగా జరిమానా కట్టాలని కూడా ఒక నివేదిక ఇచ్చారు. మిగుల భూముల విక్రయం, లైబ్రరీకి కేటాయించిన స్థలాన్ని మరో అవసరానికి వాడడం వంటి ఆరోపణలున్నాయి.

అయితే రవీంద్రనాధ్ అధ్యక్షుడు అయ్యాక.. మెగాస్టార్ చిరంజీవికి 595 గజాల స్థలాన్ని అక్రమంగా కట్టబెట్టారని, అది ప్రభుత్వ స్థలమని, దాని ద్వారా అనుచితంగా లబ్ధి పొందారని పాత కమిటీ వారు ఆరోపణలు చేశారు. ఆ స్థలాన్ని తాము ప్రభుత్వ ధరకే అమ్మాం తప్ప.. అక్రమం లేదని కొత్త కమిటీ వాదించుకుంటోంది. ఈ ఇరుపక్షాల గొడవల మధ్య జూబ్లీ హిల్స్ సొసైటీ పరువు మంటగలిసిపోతోంది. సారథ్యం స్వీకరించిన వారు.. హోదా కోసమా, ప్రతిష్ఠ కోసమో, ఏదైనా సేవ చేయడం కోసమో కాకుండా.. దందాలు చేసుకోవడానికే ఆ పదవికి పోటీపడతారేమో అనే అభిప్రాయం కలిగించేలా వీరి గొడవలు మారుతున్నాయి.

23 Replies to “ఛానెళ్ల కొట్టాటలతో బజార్న పడ్డ జూబ్లీహిల్స్ సొసైటీ!”

  1. కబ్జాలు , ఆక్రమణలు , అవినీతి చేసిన “N ” టీవీ , టీవీ-9 , సాక్షి టీవీ లను పట్టుకుంటే సొసైటీ పరువు పోవటమేమిటి ? అంటే అవినీతి చేసిసిన వాళ్ళని ఏమి తినకూడదా ?

      1. Jubilee hills housing society almost everyone was a Kamma in the 1980’s because all those lands were owned by them. But slowly some of them sold to others for higher prices and moved to madhapur and out of country. Still that area is dominated by K’s. Houses were converted to commercial buildings too owned by K’s

  2. govt rate chaala takkuva untundi.

    chiranjeevi edemi buddi. vagaane sampadinchaarugaa ..

    ntv ap ki vyatirekamu . vaalla asthulu hyderabad lo unnaayi . anduke vaallu ap ki vyatirekangaa news create chestaaru ..

    evari Asthula kosamu vaallu pani chestunnaaru ..

    deentlo evari swaardhamu vaaridi

Comments are closed.